అంత కష్టపడి చివరకు ఏం చేశాడంటే..

17 May, 2020 13:11 IST|Sakshi

సిడ్నీ : సాధారణంగా ఎవరైనా దొంగతనాని​కి వస్తే ఏం చేస్తారు.. ఏవైనా విలువైన వస్తువులు, డబ్బులు, నగలు ఎత్తుకెళ్లడం చూస్తాం. కానీ ఆస్ట్రేలియాలో సిడ్నీకి చెందిన ఒక వ్యక్తి మాత్రం అర్థరాత్రి మ్యూజియంలోకి చొరబడి డైనోసార్‌తో సెల్ఫీ దిగాడు. ఆ తర్వాత  కౌబాయ్‌ టోపీతో పాటు మ్యూజియంలోని కొన్ని ఫోటోలు ఎత్తుకెళ్లాడు. ఈ వింత ఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. దీనిపై ఆస్ట్రేలియా పోలీసులు స్పందించారు. (అది మ‌నుషుల‌కు ప్ర‌మాదం: డ‌బ్ల్యూహెచ్‌వో)

'గ‌త ఆదివారం రాత్రి ఒంటి గంట‌కు ది ఆస్ట్రేలియ‌న్ మ్యూజియంలోకి ఓ వ్య‌క్తి అక్ర‌మంగా చొర‌బ‌డ్డాడు. సుమారు 40 నిమిషాల పాటు అత‌ను మ్యూజియంలో స్వేచ్ఛ‌గా సంచ‌రించాడు . కొద్దిసేపటికి అక్క‌డ ఉన్న ఓ డైనోస‌ర్ శిలజం దగ్గరికి వెళ్లాడు. దాని నోట్లో తన ముఖం పెట్టి సెల్ఫీలు దిగాడు. ఇదంతా అక్కడి సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. డైనోసార్‌తో సెల్ఫీ తర్వాత అక్కడే ఉన్న ఒక కౌబాయ్‌ టోపీని, ఓ ఫోటోను ఎత్తుకెళ్లాడు.  అదృష్టమేంటంటే ఆ వ్యక్తి మ్యూజియంలో ఉన్న కొన్ని విలువైన పురాతన వస్తువుల జోలికి మాత్రం వెళ్లలేదు. అయితే ఈ విషయాన్ని మాత్రం తాము సీరియస్‌గా తీసుకుంటాం.ఎట్టి పరిస్థితుల్లో ఆ వ్యక్తిని పట్టుకొని తీరుతాం' అంటూ పేర్కొన్నారు. మ్యూజియంలోకి చొరబడ్డ వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. వాస్త‌వానికి పున‌ర్ నిర్మాణంలో భాగంగా సిడ్నీ మ్యూజియాన్ని గ‌త ఏడాది నుంచి మూసివేశారు. అయితే పనులన్ని పూర్తైనా ఇంతలో కరోనా మహమ్మారి రావడంతో మరోసారి మ్యూజియాన్ని మూసివేశారు.
('కళ్ల ముందే ప్రాణం పోతుంటే ఏం చేయలేకపోయా')

>
మరిన్ని వార్తలు