అర్ధరాత్రి అలర్ట్‌.. సిటీ వణికిపోయింది

9 Jul, 2018 14:30 IST|Sakshi

అర్ధరాత్రి నగరం మొత్తం గాఢ నిద్రలో ఉన్న వేళ.. ఒక్క మెసేజ్‌ నగరం మొత్తం ఉలిక్కిపడేలా చేసింది. జాంబీల భయంతో నిద్రలేని రాత్రి గడిపారు. అయితే ఉదయం అయ్యాక అదంతా ఉత్త పుకారే అని తేలటంతో అధికారులపై ప్రజలు మండిపడ్డారు.

ఫ్లోరిడా: విషయంలోకి వెళ్తే మే 20వ తేదీన ఫ్లోరిడాలోని లేక్‌వర్త్‌ నగరంలో ప్రజలంతా నిద్రిస్తున్న వేళ.. అర్ధరాత్రి ఓ సందేశం వచ్చింది. ‘విద్యుత్‌ అంతరాయం.. జాంబీ అలర్ట్‌.. సగం జనాభా ప్రమాదంలో ఉంది.  పరిస్థితి మాములు స్థితికి వచ్చేందుకు ఎంత టైం పడుతుందో ఖచ్ఛితంగా చెప్పలేం’ అంటూ అర్ధరాత్రి 1గం.45ని. సమయంలో సందేశం వచ్చింది. ఆ అలర్ట్‌ చూసిన ప్రజలంతా వణికిపోయి రాత్రంతా చీకట్లోనే జాగారం చేశారు. ఉదయానికల్లా వార్త దావానంలా పాకటంతో అధికారులు రంగంలోకి దిగారు.

పబ్లిక్‌ ఇన్ఫర్మెన్‌ కార్యాలయం నుంచే ఆ సందేశం ప్రచారం కావటంతో నగరవాసులకు క్షమాపణలు తెలియజేశారు. తాము కేవలం పవర్‌కట్‌కు సంబంధించి సందేశం మాత్రమే పంపామని.. జాంబీ అలర్ట్‌ను ఎవరో జత చేసి ఉంటారని ప్రకటించారు. తాజాగా ఈ వ్యవహారానికి సంబంధించి ఓ మాజీ ఉద్యోగిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇలాంటి పుకార్లు గతంలోనూ ప్రజలకు దడ పుట్టించాయి. ఈ ఏడాది జనవరిలో హవాలి వాసులకు బాలిస్టిక్‌ మిసైల్‌ దాడి అంటూ ఓ సందేశం పాకిపోయి పెనుకలకలమే రేగింది.

మరిన్ని వార్తలు