అది కుక్కపిల్ల కాదు: అక్కడే వదిలేయ్‌!

15 May, 2020 17:15 IST|Sakshi
చేతిలో నక్కపిల్లతో మార్సీ.కామ్‌ ట్విటర్‌ యూజర్‌, నక్కపిల్ల

టోక్యో : దారి తప్పిపోయిన అడవి నక్కపిల్లను కుక్కపిల్ల అనుకున్న ఓ వ్యక్తి దాన్ని యాజమానితో కలపటానికి తీవ్రంగా శ్రమించాడు. చివరకు నిజం తెలుసుకుని కంగుతిన్నాడు. ఈ సంఘటన జపాన్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు.. మార్సీ.కామ్‌ అనే ట్విటర్‌ యూజర్‌కు కొద్దిరోజుల క్రితం రోడ్డుపక్కన ఓ జంతువు కనిపించింది. అది కుక్కపిల్ల అనుకున్న అతడు దాన్ని ఇంటికి తీసుకువచ్చాడు. కుక్కపిల్ల అనుకుంటున్న నక్కపిల్లను యాజమానితో కలపాలన్న ఉద్ధేశ్యంతో ట్విటర్‌ ద్వారా దాని యాజమాని ఎవరికైనా తెలిస్తే చెప్పాలని, యాజమాని వద్దకు చేర్చడానికి సహకరించాలని ప్రార్థించాడు. అయితే దీనిపై స్పందించిన ఓ నెటిజన్‌ ‘‘ అది కుక్కపిల్లకాదు, నక్కపిల్ల. దాన్ని ఎక్కడినుంచి తెచ్చావో అక్కడే వదిలేయ్‌!’’ అని చెప్పాడు.
( బుల్లోడా! నువ్వు సామాన్యుడివి కాదు..)

దీంతో అతడికి అది నక్కపిల్లా? కుక్కపిల్లా? అన్న అనుమానం కలిగింది. వెంటనే దాన్ని దగ్గరిలోని జంతు వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లాడు. దాన్ని పరీక్షించిన ఆ వైద్యుడు అది కుక్కపిల్ల కాదని, అడవి నక్కపిల్ల అని తేల్చాడు. మార్సీ.కామ్‌ ట్విటర్‌ యూజర్‌ ఇక చేసేదేమీ లేక దాన్ని నక్కల అభయారణ్యంలో వదిలేశాడు. ( ఇలాంటి బాయ్‌ఫ్రెండ్ కావాలి! )

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు