మామకు సర్‌ప్రైజ్‌ ఇవ్వాలనుకుని తానే బలై..

6 Oct, 2019 09:04 IST|Sakshi

న్యూయార్క్‌ : మామకు బర్త్‌డే శుభాకాంక్షలు చెబుదామని సర్‌ప్రైజ్‌ ఇచ్చిన అల్లుడు పొరపాటున మామ చేతిలోనే మరణించిన విషాద ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో వెలుగుచూసింది. మామ డెన్నిస్‌ 61వ జన్మదినం సందర్భంగా అభినందనల్లో ముంచెత్తాలని నార్వే నుంచి ఏకంగా 4500 మైళ్లు దాటి వచ్చిన క్రిష్టఫర్‌ బెర్గాన్‌ ఇంటి వెనుక గేటు నుంచి లోపలికి దూకి సర్‌ప్రైజ్‌ చేద్దామనుకున్నాడు. తమ ఇంటి బ్యాక్‌డోర్‌ వద్ద అలికిడి విన్న డెన్నిస్‌ ఎవరో లోపలికి దూకారని భయపడి కాల్పులు జరిపాడు. తుపాకీ గుళ్లు నేరుగా బెర్గాన్‌ ఛాతీలోకి దూసుకెళ్లడంతో బాధితుడు అక్కడికక్కడే కుప్పకూలాడు. తాను షూట్‌ చేసింది తన అల్లుడినేనని తెలుసుకున్న డెన్నిస్‌ వెంటనే ఎమర్జెన్సీకి కాల్‌ చేయగా అప్పటికే మరణించినట్టు వారు నిర్ధారించారు. డెన్నిస్‌ పొరపాటున ఈ పనిచేయడంతో అతనిపై నేరాభియోగాలు మోపబోమని ఇది విషాద ఘటనని అధికారులు పేర్కొన్నారు. నార్వే పౌరుడైన బెర్గాన్‌ తన భార్యతో కలిసి స్వదేశంలో స్ధిరపడే ముందు పలు సంవత్సరాలు ఫ్లోరిడాలో ఉన్నారు. మరోవైపు జరిగిన ఘటనతో డెన్నిస్‌ కుటుంబం విషాదంలో మునిగింది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కరోనా: ‘నా రక్తంలోనే సమాధానం ఉందేమో’

నేను మాస్క్‌ పెట్టుకోను: ట్రంప్‌

కరోనా: మరో షాకింగ్‌ న్యూస్‌!

అమెరికాలో ప్రపంచ రికార్డు స్థాయి మరణాలు

ఆ వివరాలను బయట పెట్టనున్న గూగుల్‌

సినిమా

టిక్‌టాక్‌లో త్రిష.. ‘సేవేజ్‌’ పాటకు స్టెప్పులు

పెళ్లిపీటలు ఎక్కుతున్న కీర్తి సురేష్‌?

మానవత్వం మరచిన తారలు

మేడమ్‌.. థ్యాంక్యూ: విద్యాబాలన్‌

ఫ్యాన్‌ శుభ్రం చేయడానికి స్టూల్‌ అవసరమా: హీరో

ఫిల్మ్‌ జర్నలిస్టుల కోసం అండగా...