మహిళ కురచదుస్తులు వేసుకుందని..

19 Jul, 2016 19:44 IST|Sakshi
మహిళ కురచదుస్తులు వేసుకుందని..

ఓ మహిళ కురచ దుస్తులు ధరించిందనే కారణంతో ఓ ఉన్నాది దాడి చేశాడు. ఆ మహిళతో పాటు ఆమె ముగ్గురు కుమార్తెలపై కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన తల్లీకూతుళ్లు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఫ్రాన్స్లో ఈ విషాదకర సంఘటన జరిగింది.

బాధిత మహిళ (46) ముగ్గురు కూతుళ్లతో (14, 12, 8) కలసి దక్షిణ ఫ్రాన్స్​లో లరాగ్నె సమీపంలోని కొలంబె అల్పైన్ రిసార్ట్కు వెళ్లింది. వీరి గది పక్కనే నిందితుడు తన కుటుంబంతో కలసి బసచేశాడు. నిందితుడి దాడిలో మహిళ, ఆమె ముగ్గురు కుమార్తెలు తీవ్రంగా గాయపడ్డారు. వారి శరీరాలపై పలు చోట్ల కత్తిపోట్లు పడ్డాయి. తీవ్రంగా గాయపడినా వారికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. మహిళ కురచ దుస్తులు వేసుకున్నందుకు కోపంతో దాడి చేసినట్టు నిందితుడు చెప్పగా, ప్రాసిక్యూటర్ రఫల్ బలాండ్ దీన్ని తోసిపుచ్చారు. నిందితుడిపై గత 15 ఏళ్లుగా కేసులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
 

మరిన్ని వార్తలు