కెమెరాను కాకి ఎత్తుకెళ్లింది.. అద్భుత వీడియో

14 Dec, 2017 17:00 IST|Sakshi

నార్వే : ఓ వ్యక్తికి తాను కొత్త కెమెరా తీసుకున్నాన్న ఉత్సాహం కాసేపు కూడా నిలవలేదు. అత్యంత దగ్గర నుంచి షూట్‌ చేద్దామని టైమ్‌ సెట్‌ చేసి ఉంచగా దానిని దొంగ ఎత్తుకెళ్లారు. అయితే ఆ దొంగ మనిషి కాదండోయ్‌ ఓ కాకి. అవును నార్వేకు చెందిన జెల్‌ రాబర్ట్‌సన్‌ అనే వ్యక్తి సముద్రపు కాకిని అతి సమీపంలో నుంచి తన కెమెరాలో బందించాలని అనుకున్నాడు. అందులో భాగంగా ఇంటి బయట కంటెగోడపై కెమెరాను పెట్టి దానికి సమీపంలో బ్రెడ్‌ముక్కలు వేశాడు. తొలుత అక్కడి వచ్చిన కాకులు బ్రెడ్‌ ముక్కలు తిన్నాయి.

అయితే, వాటిల్లో ఒక కాకి నేరుగా ఆ 4 కె కెమెరా వద్దకు వెళ్లి తొలుత ముక్కుతో పొడిచింది. అనంతరం దానిని నోట కరుచుకొని అనూహ్యంగా ఎత్తుకెళ్లింది. ఆ సమయంలో ఆ కెమెరాలో డ్రోన్‌ వీడియో మాదిరిగా రికార్డ్‌ అయింది. ఆ కెమెరా కాస్త అతడి ఇంటికి సమీపంలోని గుట్టల ప్రాంతంలో పడేయగా అది దాదాపు ఐదు నెలల తర్వాత దొరికింది. ఆ కాకి కెమెరాను ఎత్తుకెళ్లే సమయంలో రికార్డయిన వీడియోను అతడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకోగా అది కాస్త పెద్ద వైరల్‌ అయ్యి లక్షల మంది వీక్షించారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు