విమానంలో వింతచేష్ట.. వీడియో వైరల్‌

26 Apr, 2019 09:52 IST|Sakshi

ఎర్రబస్సెక్కితే ఎలాంటి వాతావరణం ఉంటుందో మనందరికీ తెలిసిందే. అయితే ఎయిర్‌బస్‌లో ఎక్కినా.. ఎలా ప్రవర్తించాలలో కొందరికి తెలియదు. బిగ్గరగా అరుస్తు పక్కవారిని విసిగిస్తూ కొందరు, వింత ప్రవర్తనతో మరికొందరు మిగతా ప్రయాణీకులను విసిగిస్తూ ఉంటారు అచ్చం మన తెలుగు సినిమాల్లో చూపినట్టు. ప్రస్తుతం ఇలాంటి వాటికి సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఓ ప్రయాణీకుడు విమానంలోనే షేవింగ్‌ మిషన్‌తో తలను షేవ్‌ చేసుకుంటున్నాడు. విమాన సిబ్బంది అతన్ని చూసినా.. ప్రతిఘటించకుండా వెళ్లిపోయారు. ఇలాంటి చర్యలు తోటిప్రయాణికులకు ఇబ్బంధిని కలిగిస్తాయని, ఎక్కడ ఎలా ఉండాలో తెలియదా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా