మిరాకిల్‌: 15 క్యాన్‌ల బీరు తాగించి బతికించారు

8 Mar, 2020 10:56 IST|Sakshi

ముల్లును ముల్లు తోనే తీయాలి అనే సామెత మనం వింటూ ఉంటాం. అలాంటి సామెతే ఒక వ్యక్తి వ్యవహారంలో జరిగింది. కేన్ల కొద్ది బీర్లను లాగించేసే అతడి శరీరంలో మిథనాల్ స్థాయి భయంకరంగా పెరిగింది. దీంతో ఏమి చేయాలో అర్ధం కానీ వైద్యులు ఇలా ముల్లును ముల్లు తోనే తీయాలి అన్నట్లుగా అతడి శరీరంలోకి 15 కేన్ల బీరును ఆ మందుబాబు పొట్టలోకి పంప్ చేశారు. వివరాల్లోకెళ్తే.. వియత్నాంలోని క్వాంగ్త్రికి చెందిన గువన్ వాన్ నహత్ అనే వ్యక్తి ఫుల్లుగా బీర్లు వేయడంతో ఒంట్లో మిథనాల్ స్థాయి భయంకరంగా పెరిగింది. కాలేయం పూర్తిగా దెబ్బతిన్నది. చదవండి: సోషల్‌ మీడియా స్టార్స్‌ 

దీంతో డాక్టర్లు అతడిని బతికించడానికి చివరి ఉపాయంగా ముల్లును ముల్లుతోనే తీయాలనే సూత్రాన్ని ఎంచుకున్నారు. 15 కేన్ల బీరును నహత్ పొట్టలోకి పంప్‌ చేశారు. బీరుతో విషతుల్యమైన కడుపులోని విషాన్ని బీరుతోనే తీసేయాలన్నది వారి ప్లాన్. కానీ ఇది చాలా ప్రమాదకరం. అయితే రోగిని కాపడడానికి మరో మార్గం లేక దాన్నే ఎంచుకున్నారు. బీరులో మిథనాల్‌తోపాటు ఇథనాల్ కూడా ఉంటుంది. మిథనాల్ ద్వారా కడుపులో ఏర్పాడే యాసిడ్‌ను ఇథనాల్‌ నియంత్రిస్తుంది. డాక్టర్లు దానిపై నమ్మకం పెట్టుకుని పంప్ చేశారు. మంత్రం ఫలించింది. నహత్ బతికి బయటపడ్డారు. చదవండి: సరదాగా చదరంగంలోకి వచ్చా..! 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు