స్పైడర్‌మ్యాన్‌లా వెళ్లి.. ఏం చేశాడంటే

31 Oct, 2016 10:38 IST|Sakshi
స్పైడర్‌మ్యాన్‌లా వెళ్లి.. ఏం చేశాడంటే
రెండేళ్ల వయసున్న ఓ పిల్లాడు చైనాలోని లియావోచెంగ్ నగరంలో ఓ అపార్టుమెంటు మూడో అంతస్తు బయట కిటికీ తలుపునకు వేలాడుతున్నాడు. ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో ఆడుకుంటూ బయటకు వచ్చి.. ఎలా ఇరుక్కున్నాడో తెలియదు గానీ, కిటికీ బయటకు వచ్చి వేళ్లాడుతూ ఉన్నాడు. అతడి చొక్కా ఒక తలుపు హుక్‌ వద్ద ఇరుక్కోవడంతో అతడు అక్కడ ఆగిపోయాడు. పిల్లాడు అలా వేలాడుతుండటం చూసి చుట్టుపక్కల వాళ్లంతా ఒక్కసారిగా హాహాకారాలు చేశారు. వాళ్ల అరుపులు విని.. అక్కడకు సమీపంలోనే ఉండే లియాంగ్ అనే వ్యక్తి వచ్చి చూశాడు. పిల్లాడిని ఆ పరిస్థితిలో చూసి ఒక్క క్షణం కూడా ఆగకుండా చకచకా స్పైడర్ మ్యాన్‌లాగే కిటికీలు పట్టుకుని పైకి ఎక్కి, ఆ పిల్లాడిని ఒక చేత్తోను, కిటికీ ఊచలను మరో చేత్తోను గట్టిగా పట్టుకున్నాడు. కాసేపటి తర్వాత ఎమర్జెన్సీ సర్వీసు సిబ్బంది వచ్చి.. కింద ఉయ్యాల లాంటిది ఏర్పాటు చేశారు. 
 
పొరపాటున లియాంగ్, పిల్లాడు కింద పడినా వాళ్లకు దెబ్బ తగలకూడదని అలా చేశారు. కానీ ఈలోపు తాళాల కంపెనీకి చెందిన ఒక ఉద్యోగి వచ్చి.. మూడో అంతస్తులో పిల్లాడు ఉన్న అపార్టుమెంటు తాళాన్ని తెరిచాడు. దాంతో కిటికీ గుండానే లియాంగ్, ఆ పిల్లాడు గదిలోకి వెళ్లిపోయారు. పిల్లవాడి మెడ మీద కిటికీ ఊచల మచ్చలు ఉన్నాయని, అతడు ఏమాత్రం మెడ తిప్పి ఉన్నా కిందకు పడిపోయి ఉండేవాడని లియాంగ్ చెప్పాడు. భయంతో అతడి కాళ్లు వణికిపోతుండటాన్ని తాను కింది నుంచి చూశానని, దాంతో తాను ఎక్కగలనో లేదో అని ఆలోచించకుండా పైకి ఎక్కేశానని వివరించాడు. ఈ మొత్తం దృశ్యాన్ని పొరుగునుండే మరో వ్యక్తి తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. చాలాసేపటి తర్వాత వచ్చిన పిల్లవాడి తల్లిదండ్రులు జరిగిన విషయం మొత్తం తెలుసుకుని... లియాంగ్ ధైర్యసాహసాలు, తమ కొడుకును రక్షించిన వైనానికి అతడికి కృతజ్ఞతలు తెలిపారు. 
Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పాక్‌లో 40 వేల మంది ఉగ్రవాదులు!

బ్యూటీక్వీన్‌కు విడాకులిచ్చిన మాజీ రాజు!

ఉడత మాంసం వాసన చూపిస్తూ..

మాస్టర్‌ చెఫ్‌; 40 శాతం పెంచితేనే ఉంటాం!

అదొక భయానక దృశ్యం!

ఆ షూస్‌ ధర రూ. 3 కోట్లు!

నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ మరణం; రహస్య ఒప్పందం?!

అందుకే మా దేశం బదనాం అయింది: పాక్‌ ప్రధాని

భయానక అనుభవం; తప్పదు మరి!

‘మేమిచ్చిన సమాచారంతోనే లాడెన్‌ హతం’

ఊచకోత కారకుడు మృతి

అదంతే..అనాదిగా ఇంతే!

ఆ యాప్‌లో అసభ్యకర సందేశాలు!

బ్రిటన్‌ నూతన ప్రధానిగా బోరిస్‌ జాన్సన్‌

బుడుగులకో ‘సెర్చ్‌ ఇంజన్‌’!

ఆడి కారు కోసం... ఇంట్లోనే డబ్బులు ప్రింట్‌ చేసి..

అక్కడ సెల్ఫీ తీసుకుంటే అదుర్స్‌!

కశ్మీర్‌పై ట్రంప్‌ వ్యాఖ్యలను ఖండించిన భారత్‌

విమానం పైకెక్కి వ్యక్తి హల్‌చల్‌

మెక్సికన్‌ గల్ఫ్‌లో అరుదైన షార్క్‌ చేప..

సెలబ్రిటీల స్వర్గమేమో కదా అదీ!

పాక్‌ ప్రధానిని అవమానించిన అమెరికా

‘థ్యాంక్‌ గాడ్‌.. ఆ బాలుడు చేపకు చిక్కలేదు’

ఆ సరస్సులో దిగారా.. ఇక అంతే!

పాక్‌ ప్రధాని ప్రసంగం.. నినాదాలతో రచ్చరచ్చ!

ఇక ద్రవాలూ అయస్కాంతాలే!

కీళ్ల కదలికలతోనూ విద్యుత్తు...

మొసలికి చిప్‌..

నకిలీ ఉద్యోగాల ఉచ్చులో భారతీయులు

అమెరికాలో పూజారిపై దాడి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అక్కడ కూర్చిని హోమ్‌ వర్క్‌ చేసుకునేదాన్ని

విమర్శ మంచే చేసిందన్నమాట..

విజయ్‌ @ 800

ఆపరేషన్‌ సక్సెస్‌

వందలో ఒక్కరు!

జ్ఞాపకశక్తి కోల్పోయా