వైరల్‌ : పాపం చడ్డీమ్యాన్‌! 

2 Feb, 2020 16:38 IST|Sakshi

స్విట్జర్లాండ్‌ : తప్పు చేసిన వారెవరైనా శిక్ష అనుభవించక తప్పదు. అన్ని సమయాల్లో చట్టం మనల్ని శిక్షించకపోవచ్చు..కానీ, దేవుడు తప్పకుండా శిక్షిస్తాడు. అది ఈ చడ్డీమ్యాన్‌ విషయంలో రుజువైంది. ఏ తప్పు చేశాడో తెలియదు కానీ, పోలీసుల నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నించి చావు తప్పి కన్ను లొట్టపోగొట్టుకున్నాడు. రెండవ అంతస్తు మీదనుంచి కిందపడి గాయాలపాలయ్యాడు. ఈ సంఘటన స్విట్జర్లాండ్‌లోని వాలీసెల్లెన్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. వాలీసెల్లెన్‌లోని ఓ హోటల్‌ గదిలో దిగిన ఓ వ్యక్తి పోలీసులు వెంటపడటంతో గదిలోనుంచి తప్పించుకోవటానికి ప్రయత్నించాడు. ఆ తొందరలో చడ్డీ మాత్రమే వేసుకున్నానన్న సోయలేకుండా కిటికీలోనుంచి కిందకు దూకడానికి ప్రయత్నించాడు. అయితే ప్రయత్నం బెడిసికొట్టి బొక్కబోర్లా కింద ఉన్న కారుపై పడ్డాడు ఆ తర్వాత పల్టీ కొట్టి నేలపైకి జారాడు. అదే సమయంలో అటుగా వెళుతున్న ఓ వ్యక్తి దాన్ని వీడియో తీసి ఆలస్యంగా ఇంటర్‌నెట్‌లో ఉంచాడు. దీంతో వీడియో కాస్తా వైరల్‌గా మారింది. 

మరిన్ని వార్తలు