కుక్కకు పేరు పెడతావా..?

19 May, 2019 04:30 IST|Sakshi

మీరు కుక్కపిల్లను పెంచుకుంటున్నారా..? ముద్దుముద్దుగా ఉందని.. ముద్దుగా పిలుచుకునేందుకు ఏదైనా పేరు పెట్టారా..? అవును అందులో కొత్తేముంది. టామీ, పప్పీ, రాకీ, రాజు, ఇలా చాలా పేర్లే పెట్టుకుంటుంటారు. అయితే చైనాలో ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కకు పేరు పెట్టినందుకు కటకటాలపాలయ్యాడు. కుక్కకు పేరు పెట్టడం కూడా చైనాలో నేరమా అనుకుంటున్నారా..? అసలు కథేంటో మీరే చదివి తెలుసుకోండి. 30 ఏళ్ల బాన్‌ అనే వ్యక్తి తన రెండు పెంపుడు కుక్కలకు పేర్లు పెట్టాడు. అక్కడితో ఆగకుండా.. వీచాట్‌ సోషల్‌ మీడియాలో వాటి ఫొటోలతో పాటు పేర్లు కూడా పోస్ట్‌ చేశాడు.

ఒక కుక్క పేరేమో చెన్‌గువాన్, మరో కుక్క పేరేమో షీగువాన్‌. ట్రాఫిక్‌ పోలీసులను అక్కడ షీగువాన్‌ అంటారట. ఆ పేర్లు కుక్కలకు పెట్టడం నిషేధం ఉందట. దీంతో పోలీసులకు తిక్కరేగి అతడిని అరెస్ట్‌ చేశారు. తనకు వాటికి పేర్లు పెట్టడం చట్టవ్యతిరేకమని తెలియదని, ఏదో జోక్‌ చేద్దామని అలా పెట్టానని పోలీసులకు చెప్పాడు. అయితే అందులో పోలీసులకు జోక్‌ కనిపించలేదట. అందుకే విచారణ జరిపి అతడిని అరెస్ట్‌ చేసి పది రోజుల పాటు కటకటాల వెనక్కి పంపారు. అందుకే ఏదైనా పని చేసేటప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించాలి.. లేదంటే ఇదిగో ఇలాగే అవుతుంది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా