ఒకే సారి 15 టీ షర్ట్స్‌ ధరించాడు.. ఎందుకంటే

9 Jul, 2019 19:15 IST|Sakshi

ఎడిన్‌బర్గ్‌ : విమానంలో అదనపు లగేజీ చార్జీల నుంచి తప్పించుకోవడానికి మంచేస్టర్‌ మహిళ చేసిన పనిని నెటిజన్లు ఇప్పటికి మర్చిపోలేదు. సదరు మహిళ లగేజ్‌​ చార్జీ తప్పించుకోవడం కోసం ఒకదానిమీద ఒకటి ఏడు డ్రెస్సులు, రెండు చొక్కాలు ధరించి విమానాశ్రయ సిబ్బందిని విస్మయానికి గురి చేసింది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి కూడా సదరు మహిళను స్ఫూర్తిగా తీసుకున్నాడేమో.. అతను కూడా అలానే చేశాడు. లగేజీ చార్జీలు తప్పించుకునేందుకు ఈ వ్యక్తి ఏకంగా 15 టీ షర్ట్స్‌ను ఒక దాని మీద ఒకటి ధరించాడు.

వివరాలు.. గ్లాస్గోకు చెందిన జాన్‌ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి ఎడిన్‌బర్గ్‌ వెళ్తున్నాడు. అయితే విమానాశ్రయ నిబంధనల ప్రకారం ప్రయాణికులు తమ వెంట 8కిలోల కన్నా ఎక్కువ లగేజీ తీసుకెళ్లకూడదు. అలా చేస్తే జరిమానా చెల్లించాల్సి వస్తుంది. ఈ క్రమంలో జాన్‌ లగేజీ 8కిలోల కంటే ఎక్కువగానే ఉంది. దాంతో అతను లగేజీ చార్జీ తప్పించుకోవడం కోసం బ్యాగులో నుంచి టీ షర్టులు తీసి ఒక దాని మీద ఒకటి ధరించడం ప్రారంభించాడు. ఇలా మొత్తం 15 టీ షర్ట్స్‌ ధరించాడు. అయితే ఈ మొత్తం తతంగాన్నంతా ఎవరో వీడియో తీసి ట్విటర్‌లో పోస్ట్‌ చేయడంతో ప్రస్తుతం అది తెగ వైరలవుతోది.
 

మరిన్ని వార్తలు