అమెరికాలో ఘోర రైలు ప్రమాదం

13 May, 2015 10:46 IST|Sakshi
ప్రమాద స్థలంలో చిందరవందరగా పడిపోయిన బోగీలు

అమెరికాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. 238 మంది ప్రయాణికులతో రాజధాని నగరం వాషింగ్టన్ నుంచి న్యూయార్క్ వెళుతోన్న ఆమ్ట్రాక్ లోకల్ రైలు మంగళవారం రాత్రి ఫిలడెల్ఫియాలోని వీట్షెల్ఫ్ లేక్బ్లాక్ వద్ద పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఐదురుగు మృతి చెందగా, దాదాపు 60 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఆరుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు  అధికారులు తెలిపారు.

మంగళవారం రాత్రి 7:10 కి వాషింగ్టన్ స్టేషన్ నుంచి బయలుదేన 188వ నంబర్ ట్రైన్  10:34కు న్యూయార్క్ చేరుకోవాల్సి ఉంది. ఈ రెండు స్టేషన్లకు సరిగ్గా మధ్యలో ఉండే ఫిలడెల్ఫియా వద్ద గల ఓ మూల మలుపు తిరిగే క్రమంలో నియంత్రణ కోల్పోయి రైలు పట్టాలు తప్పిందని, ప్రమాదం సమయంలో అది గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోందని అధికారులు చెప్పారు. బోల్తా పడ్డ పది బోగీలు.. కొద్ది మీటర్లవరకు దొర్లుకుంటూ వెళ్లడంవల్ల పెద్ద సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారని వివరించారు. సహాయక బృందాలు రంగంలోకిదిగి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్నారు.

మరిన్ని వార్తలు