ఈ గాలి.. ఈ నేల..

15 Jun, 2014 02:09 IST|Sakshi
ఈ గాలి.. ఈ నేల..

కాస్ట్‌లీ మార్బుల్ ఫ్లోర్లు.. ఆధునిక బాత్ టబ్బులు.. స్పాలు.. ఇలా ఎన్నో ఆధునిక సదుపాయాలున్న హోటళ్లను మీరు చూసుండొచ్చు. ఒక్కసారి ఇండోనేసియాలోని బాలీలో ఉన్న బాంబూ ఇండా హోటల్‌కు వెళ్లి చూడండి. అమ్మ ఒడిలో సేదదీరిన అనుభూతి కలుగుతుంది. పైగా.. ఈ హోటల్‌లోని ‘ష్రింప్’ గెస్ట్‌హౌస్‌కు వెళితే.. నదిపై నడిచినట్లు.. చేపలతో ముచ్చట్లాడిన ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే.. దీన్ని ఆయుంగ్ నదీ జలాలపైనే కట్టారు. బెస్తవారి గ్రామంలో ఉన్న ఫీలింగ్ కలగడానికి.. గదిలోనే తెడ్డు, వల వంటివీ ఉంటాయి. కెనడాకు చెందిన జాన్ హార్డీ దంపతులు ఇక్కడి పురాతన గృహాలను గెస్ట్‌హౌస్‌లుగా మార్చారు.

ప్రకృతి ఒడిలో సేదదీరాలనుకునేవారికి ఈ గెస్ట్‌హౌస్‌లే కేరాఫ్ అడ్రస్‌లు. గదుల్లో కూడా దోమల మందుల్లాంటివి ఉండవు. తెరలే ఉంటాయి. చుట్టూ కొండలు, వరిచేలు, ఆయుంగ్ నది.. దగ్గర్లోనే హిందూ దేవాలయం.. చూస్తే వాహ్ అనకుండా ఉండలేం.. అతిథులు రూముల్లోకి వెళ్లాలంటే.. ఇలా రాళ్ల మీద నుంచే నడిచివెళ్లాలి. ఇందులో ఒక రోజు బస చేయడానికి గెస్ట్‌హౌస్ స్థాయిని బట్టి రూ.12 వేల నుంచి రూ.30 వేల వరకూ చెల్లించాల్సి ఉంటుంది.
 

>
మరిన్ని వార్తలు