ఆ మత్తుతో గుండె చిత్తు

14 Nov, 2016 15:05 IST|Sakshi
ఆ మత్తుతో గుండె చిత్తు

న్యూయార్క్: గంజాయి వాడకం గుండె సమస్యలను రెట్టింపు చేస్తుందని తాజా పరిశోధనలో తేలింది. గంజాయి మూలంగా నాడీ వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమౌతుందని తెలిసినప్పటికీ.. ఇది గుండెపై చూపించే దుష్ఫలితాలపై అంతగా అవగాహన లేదు. అమెరికాలోని సెయింట్ ల్యూక్ యూనివర్సిటీకి చెందిన భారత సంతతి ప్రొఫెసర్ అమితోజ్ సింగ్ ఈ అంశంపై పరిశోధన నిర్వహించారు. గంజాయి వాడకం మూలంగా గుండె కండరాలు బలహీనపడతాయని ఆయన వెల్లడించారు.

గంజాయి వాడేవారిలో చాలా తక్కువ వయసులో గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉందని పరిశోధనలో తేలింది. ముఖ్యంగా స్ట్రెస్ కార్డియోమయోపతికి గంజాయి దోహదం చేస్తుందని అమితోజ్ సింగ్ తెలిపారు. స్ట్రెస్ కార్డియోమయోపతిలో గుండె కండరాలు బలహీనపడి.. రక్తాన్ని పంప్ చేసే సామర్థ్యం తగ్గుతుంది.

మరిన్ని వార్తలు