సముద్రగర్భంలో తీసిన షాకింగ్ వీడియో

18 Jun, 2016 13:14 IST|Sakshi
సముద్రగర్భంలో తీసిన షాకింగ్ వీడియో

ఒకేసారి పెట్టిన వేలాది గుడ్ల ద్వారా ఉద్భవించే పీతలు.. పెరిగేకొద్దీ స్వజాతి జీవులను సహించలేవు. ఆహారం, స్థలం.. అన్నింటికోసం ఒకదానితో ఒకటి పోటీపడుతుంటాయి. అలాంటి పీతలు క్రమంగా ఒక్కటవుతున్నాయి. పీతల జీవన విదానంలో చోటుచేసుకుంటున్న ఈ మార్పులకు సంబంధించిన షాకింగ్ వీడియో ఒకటి ఇటీవలే బయటికి వచ్చింది.

ఆస్ట్రేలియాకు చెందిన సముద్రగర్భ శాస్త్రవేత్త షెరీ మారిస్ మెల్ బోర్న్ లోని పోర్ట్ ఫిలిఫ్ బే సముద్ర గర్భంలో యాదృచ్ఛికంగా తీసిన వీడియోలో.. జెయింట్ క్రాబ్(రాకాసి పీత) ఒకటి ముందు నడుస్తుండగా, వేలాది పీతలు దాన్ని అనుసరిస్తూ కనిపించాయి. ఎవరిమీదో దండయాత్రకు వెళుతున్నట్లు లేదా కవాతు నిర్వహిస్తున్నట్లు క్రమపద్ధతిలో సాగిపోయిన పీతల బృందం తనకు కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం కల్పించినట్లు షెరీ చెప్పింది.

ప్రాణ రక్షణ, ఆహార సేకరణ వంటి అత్యవసరాలను ఒంటరిగాకంటే బృందంగా ఉంటేనే చక్కబెట్టుకోవచ్చన్న ఆలోచనతోనే ఒక్కటయ్యాయని, అవి స్వజాతివైరం వీడటం ఆశ్చర్యం కలిగిస్తున్నదని ఆమె పేర్కొన్నారు. ఇప్పుడు గుంపులుగా ఏర్పడ్డ పీతలు.. ముందుముందు మనుషులతో పోరాటానికి దిగితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి..!

మరిన్ని వార్తలు