జుకర్‌బర్గ్‌ విరాళం రూ.187 కోట్లు 

30 Mar, 2020 06:50 IST|Sakshi

హూస్టన్‌: కరోనా సంక్షోభంతో ప్రపంచమే స్తంభించిపోయింది. ఆర్థికం, వర్తకం, వాణిజ్యం, క్రీడా రంగం ఇలా ఏ రంగాన్ని అయినా కరోనా మహమ్మారి వదల్లేదు. ఈ ప్రాణాంత వైరస్‌ సోకిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కాగా, కరోనా వైరస్‌ బారినపడి ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది మరణిస్తుండడం పట్ల ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్గ్‌ జుకర్‌బర్గ్, ఆయన భార్య ప్రిస్కిలా చాన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా నివారణపై పరిశోధనలకు ఆ ఫౌండేషన్‌కు 25 మిలియన్‌ డాలర్ల (రూ.187.19 కోట్లు) విరాళం ప్రకటించారు. (కరోనాపై పోరుకు ‘టాటా’ విరాళం 1,500కోట్లు..)
చదవండి: వేతనం వదులుకునేందుకు రొనాల్డో సై 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు