ఖలీద్‌ మసూద్‌ అలియాస్‌ అడ్రియన్‌ రస్సెల్‌

25 Mar, 2017 01:26 IST|Sakshi
ఖలీద్‌ మసూద్‌ అలియాస్‌ అడ్రియన్‌ రస్సెల్‌

లండన్‌: బ్రిటన్‌ పార్లమెంట్‌పై దాడికి పాల్పడిన 52 ఏళ్ల వ్యక్తి అసలు పేరు అడ్రియన్‌ రస్సెల్‌ అజావ్‌ అని ఇస్లాం మతం స్వీకరించి తన పేరును ఖలీద్‌ మసూద్‌గా మార్చుకున్నట్లు పోలీసులు గుర్తించారు. దాడికి మసూద్‌ సన్నద్ధత, ప్రేరణ, సహచరుల గురించి తెల్సుకునేందుకు ‘ఆపరేషన్‌ క్లాసిఫిక్‌’ పేరిట వందల మంది అధికారులతో కౌంటర్‌ టెర్రరిజం కమాండ్‌ విచారణను ముమ్మరం చేశారు. మసూద్‌కు ఎన్నోమారు పేర్లున్నా చిన్నతనంలో అతన్ని అడ్రియన్‌ రస్సెల్‌ అని పిలిచేవారు.

గతంలోనూ నేరచరిత్ర ఉన్న అతను 2000లో ఓ మహిళ ముఖంపై కత్తితో దాడిచేయడంతో అతని కుటుంబాన్ని స్థానిక కోర్టు బహిష్కరిస్తూ అతనికి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. కాగా, బ్రిటన్‌ పార్లమెంట్‌పై జరిగిన దాడిలో గాయపడిన మరో వ్యక్తి గురువారం చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 5కు చేరింది. మరోవైపు,  ప్రధాని మోదీ బ్రిటన్‌ ప్రధాని థెరిసా మేతో మాట్లాడారని, ఉగ్రదాడులపై సంఘీభావాన్ని వ్యక్తం చేశారని ప్రధాని కార్యాలయం శుక్రవారం ట్వీటర్‌లో తెలిపింది.

మరిన్ని వార్తలు