అమెరికాలో మేయర్ అనుమానాస్పద మృతి

1 Dec, 2015 16:33 IST|Sakshi
అమెరికాలో మేయర్ అనుమానాస్పద మృతి
లండన్: అమెరికా అలాస్కా  రాజధాని నగరం జునేయూ మేయర్  అనుమానాస్పద స్థితిలో మరణించడం కలకలం రేపింది.  మేయర్ గా బాధ్యతలు చేపట్టిన రెండు నెలల్లోనే ఆయన చనిపోవడం విషాదాన్ని నింపింది. 
అలాస్కా రాజధాని  జునేయూలోని ఆయన నివాసంలో పడి ఉన్న  గ్రెగ్ ఫిస్క్ (70)  మృతదేహాన్ని సోమవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుర్తుతెలియని వ్యక్తి తమకు సమాచారంతో మేయర్ చనిపోయినట్టు గుర్తించామని అధికారికంగా పోలీసులు ప్రకటించారు. ఆయన మృతిగల కారణాలు తెలియరాలేదని,  విచారణ  సాగుతోందన్నారు. మేయర్  ఆకస్మిక మరణంపై డిప్యూటీ మేయర్  బెకర్ దిగ్ర్భాంతి  వ్యక్తం చేశారు.  మంచి స్నేహితుడిని  కోల్పోయానంటూ సంతాపం వ్యక్తం చేశారు. 
 కాగా ఆయన రాజకీయాల్లోకి రాకముందు వ్యాపారం నిర్వహించుకునే ఫిస్క్  గత 43  ఏళ్లుగా నగరంలో ఉంటున్నారు. అన్ని విధాలా స్థానికులకు సహాయ పడుతూ,   అందరికీ తలలో నాలుకలా మెలిగేవాడని మంచి పేరుంది.   గత జూన్ 6న  మేయర్  గా ఎన్నికైన    ఫిస్క్కు  కొడుకు ఇయాన్, మనమడు కాయ్  ఉన్నారు. 
 

 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు