ట్రంప్‌కు ప్రిన్స్‌హ్యారీ, మార్కెల్‌ కౌంటర్‌

31 Mar, 2020 12:08 IST|Sakshi

వాషింగ్టన్‌ : ప్రిన్స్‌హ్యారీ, మేఘన్‌ మార్కెల్‌ దంపతులకు తాము భద్రత ఖర్చులను చెల్లించలేమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ట్వీట్‌పై హ్యారీ దంపతులు స్పందించారు. తమకు ట్రంప్‌ ఏమాత్రం సహాయం చెయాల్సిన అవసరం లేదని, తమ వ్యక్తిగత భద్రత ఖర్చులను తామే భరిస్తామని ట్రంప్‌కు ట్విటర్‌ వేదికగా బదులిచ్చారు. కాగా బ్రిటన్‌ రాజకుటుంబ నుంచి విడిపోయిన అనంతరం ప్రిన్స్‌హ్యారీ, మార్కెల్‌ జంట తొలుత కెనడా స్థిరపడిన విషయం తెలిసిందే. అనంతరం అమెరికాలోని లాక్‌ఏంజెల్స్‌కు మకాం మార్చారు. ఈ నేపథ్యంలో వారికి తమ ప్రభుత్వం భద్రత కల్పించే ప్రసక్తేలేదంటూ ట్రంప్‌ స్పష్టం చేశారు.

అయితే ట్రంప్‌ వ్యాఖ్యల వెనుక రాజకీయ కోణం ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. గత అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్‌కు వ్యతిరేకంగా హ్యారీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనిని దృష్టిలో ఉంచుకుని వారి భద్రతకు ట్రంప్‌ నిరాకరించినట్లు తెలుస్తోంది. ‘నేను.. యునైటెడ్ కింగ్‌డమ్‌, ఆదేశ రాణికి మంచి స్నేహితుడిని. రాజ కుటుంబం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన హ్యారీ, మేఘన్.. కెనడాలో శాశ్వతంగా నివసిస్తారని తెలిసింది. ఇప్పుడు వారు కెనడా నుంచి యుఎస్‌కు వచ్చారనే వార్తలు వినిపిస్తున్నాయి. వారి భద్రతా ఖర్చులు మా ప్రభుత్వం చెల్లించదు. వారే స్వయంగా చెల్లించాలి’ అని అంతకుముందు ట్రంప్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు