మెలానియా, ట్రూడో ఫొటోపై విపరీతపు కామెంట్లు!

27 Aug, 2019 12:34 IST|Sakshi

పారిస్‌ : అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌, కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడోల ఫొటోపై నెటిజన్లు విపరీతపు కామెంట్లు చేస్తున్నారు. ఎన్నో రోజులుగా మెలానియా చూపు ట్రూడోపై ఉందని...చాలా మంది అమ్మాయిల్లాగే ఆమె కూడా కెనడా పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారంటూ #మెలానియాలవ్స్‌ట్రూడో అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్‌ చేస్తున్నారు. ఇంతకీ విషయమేమిటంటే... ఫ్రాన్స్‌లోని బియార్రిట్జ్‌లో జరుగుతున్న జీ 7 సదస్సుకు ఆయా దేశాల అధినేతలు పలువురు వారి జీవిత భాగస్వాములతో హాజరైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆదివారం సాయంత్రం దేశాధినేతల కుటుంబాలు ఒక్కచోట చేరి ఫొటోలకు ఫోజులిచ్చాయి. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన భార్య మెలానియాతో కలిసి వేదిక వద్దకు చేరుకున్నారు. ఫొటోలు దిగుతున్న సమయంలో మెలానియా తన పక్కనే ఉన్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోను మర్యాదపూర్వకంగా ముద్దుపెట్టుకున్నారు. 

ఇక అదే సమయంలో పక్కనే ఉన్న ట్రంప్‌ కళ్లు కిందకు వాల్చుకున్నట్లుగా ఉన్న ఫొటోను రాయిటర్స్‌ ట్విటర్‌లో షేర్‌ చేసింది. ‘ జీ7 ఫ్యామిలీ ఫొటోషూట్‌లో భాగంగా అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌.. కెనడా ప్రధాన మంత్రి జస్టిన్‌ ట్రూడోను ముద్దాడారు. అప్పుడు ట్రంప్‌ కిందకు చూస్తుండిపోయారు’ అంటూ జీ 7 సదస్సు ఫొటోలను పోస్ట్‌ చేసింది. ఈ నేపథ్యంలో మెలానియా-ట్రూడో-ట్రంప్‌ల ఫొటోపై స్పందించిన నెటిజన్లు...‘ట్రంప్‌నకు పెద్ద చిక్కే వచ్చిపడింది. మెలానియా రిస్క్‌ చేయడానికి వెనుకాడటం లేదనుకుంటా’ అంటూ విపరీర్థాలతో కామెంట్‌ చేస్తున్నారు. మరికొంత మంది గతంలో ట్రంప్‌ కూతురు ఇవాంకా ట్రూడో పక్కన కూర్చున్న ఫొటోను, ప్రస్తుతం మెలానియా ఫొటోను పోలుస్తూ...‘ ఇవాంకా, మెలానియా ట్రూడో వైపు ఎలా చూస్తున్నారో గమనించండి. మీ జీవితంలో అట్లాంటి వ్యక్తి రావాలని కోరుకోండి. ఎంతైనా ట్రూడో భలే అందగాడు. ఇదే కాదు గతంలో ఎన్నోసార్లు మెలానియా ట్రూడోను ఇలాగే చూశారు. అసలు విషయం ఏమిటో’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ట్రంప్‌ మాజీ పార్టనర్‌ అరెస్టు

బ్రెజిల్‌ అధ్యక్షుడికి అమెజాన్‌ సెగలు

భారత్‌తో అణు యుద్ధానికైనా రెడీ

కశ్మీర్‌పై మధ్యవర్తికి తావులేదు : మోదీ

జీ7 వేదికగా అమెరికాకు అవమానం!

నీ కక్కుర్తి తగలెయ్య; నువ్వేం తల్లివి?!

‘ఎన్ని గాయాలైనా నవ్వుతూనే ఉంటా’

2 లక్షల మంది రోహింగ్యాల ర్యాలీ

అంతరిక్షంలో తొలి నేరం

బహ్రెయిన్‌కు మీ కోసం వచ్చా

పాక్‌కు మరో షాక్‌..

విషాదం: పెళ్లైన నిమిషాల్లోనే ఓ జంట..

ట్రంప్‌ను ఉడికించడమే కిమ్‌కు ఇష్టం

ఈ భార్యాభర్తల పంచాయితీ చరిత్రలో నిలిచిపోతుంది..!

కలకలం : అమెరికాలో ఆగంతకుడి కాల్పులు

మోదీకి యూఏఈ అవార్డు

ఆ దేశ మహిళలకే ఆయుర్దాయం ఎక్కువ

పిల్లి.. బాతు అయిందా..!

‘అమెజాన్‌’ కు నిప్పంటించారా?

ఆఖరి క్షణాలు.. ‘నాకు చావాలని లేదు’..

వైరల్‌: కాకిని చూసి బుద్ది తెచ్చుకోండయ్యా!

పంతం నెగ్గించుకున్న రష్యా

అవినీతి, ఉగ్రవాదానికి అడ్డుకట్ట

బ్లాక్‌లిస్టులో పాక్‌..!

ఈనాటి ముఖ్యాంశాలు

పారిపోయిన ఖైదీలు తిరిగొచ్చారెందుకో!

మీ ఫుట్‌బాల్‌ టీంకు భారత్‌లోనే అభిమానులు ఎక్కువ

చిదంబరం చేసిన తప్పు ఇదే..

ఒక్క టాబ్లెట్‌తో గుండె జబ్బులు మాయం!

కశ్మీర్ సమస్యపై మధ్యవర్తిత్వానికి ట్రంప్‌ సై

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అమ్మకు ప్రేమతో.. దేవీ శ్రీ ప్రసాద్

‘ఇక్కడ రచయితలకు గౌరవం లేదు’

ప్రేమ కోసం పరిగెత్తాల్సిన అవసరం లేదు

విజయ్‌ వర్సెస్‌ విజయ్‌

సూర్య చిత్రానికి అడ్డంకులు

పీవీఆర్‌ సినిమాస్‌, సినీపొలిస్‌లకు షాక్‌