వెయ్యి కోట్లకు దావా వేసిన ట్రంప్‌ భార్య

3 Sep, 2016 07:41 IST|Sakshi
వెయ్యి కోట్లకు దావా వేసిన ట్రంప్‌ భార్య

వాషింగ్టన్: డైలీ మెయిల్, అమెరికా చెందిన బ్లాగ్ టార్ప్లేపై రిపబ్లికన్ పార్టీ అమెరికా అధ్యక్ష పదవి అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా పరువునష్టం దావా వేశారు. తన ప్రతిష్టను దెబ్బతీసినందుకు వెయ్యి కోట్ల రూపాయలకు(150 మిలియన్ డాలర్లు) చెల్లించాలని మేరీలాండ్ కోర్టులో దావా దాఖలు చేశారు. న్యూయార్క్ లో మెలానియా పార్ట్ టైమ్ సెక్స్ వర్కర్(ఎస్కార్ట్) గా పనిచేశారని, ఆ సమయంలోనే డొనాల్డ్ ట్రంప్ ఆమెకు పరిచయం అయ్యారని డైలీ మెయిల్ ప్రచురించింది.

దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మెలానియాపై రాసిన కథనాలు పూర్తిగా అసత్యమని ఆమె తరపు న్యాయవాది చార్లెస్ హార్డర్ అన్నారు. ‘ఇందులో ఏమాత్రం వాస్తవం లేదు. మెలానియా గురించి రాసిదంతా వంద శాతం అబద్ధం. ఆమె వ్యక్తిగత, వృత్తిపరమైన గౌరవానికి భంగం కలిగించేలా రాశారు. తన గురించి ఇష్టమొచ్చినట్టు రాసినందుకు రెండు రెండు సంస్థలపై 150 మిలియన్ డాలర్లకు పరువు నష్టం దావా వేశార’ని చార్లెస్ హార్డర్ తెలిపారు. స్లోవెనియాలో జన్మించిన మెలానియా 1990 దశకంలో అమెరికాలో మోడల్ గా పనిచేశారు. 2005లో ట్రంప్ ను ఆమె పెళ్లి చేసుకున్నారు

మరిన్ని వార్తలు