లింగ భేధం కూడా పురుషుల్లో ప్రభావం చూపుతుంది

15 May, 2020 16:05 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కోరలు చాస్తుంది. ఈ మహమ్మారి దరి చేరకుండా ఉండేందకు తీసుకునే జాగ్రత్తలో మాస్క్‌ ధరించడం తప్పనిసరి. అయితే స్క్‌ను ధరించేందుకు కొంతమంది పురుషులు ఇష్టపడటం లేదని యుకే, కాలిఫోర్నియాకు చెందిన పరిశోధకుల ఆధ్యయనంలో తెలింది. ఎందుకంటే పురుషులు మాస్క్‌ ధరించడాన్ని బలహీనతకు సంకేతంగా భావిస్తున్నారని అందుకనే ఎక్కవ మంది పురుషులు మాస్క్‌ ధరించేందుకు ఆసక్తి చూపడం లేదని ఆధ్యయనంలో పేర్కొన్నారు. (మాస్కులు లేకుండా రోడ్డెక్కితే అంతే!)

యుకేలోని మిడిల్‌ సెక్స్‌ విశ్వవిద్యాలయం, కాలిఫోర్నియాలోని బర్కిలోని మ్యాథమెటికల్‌ సైన్స్‌ రీసెర్చ్‌ ఇనిస్టీట్యూట్‌ పరిశోధకులు మాస్క్‌ ధరించని పురుషులపై ఆధ్యయనం చేశారు. తప్పనిసరిగ ఫేస్‌ మాస్క్‌లు ధరించడమనేది మహిళల కంటే పురుషులపై అత్యధిక ప్రభావాన్ని చూపుతున్నట్లు వారి అధ్యయనంలో వెల్లడించారు. అంతేగాక దీనిపై రచయితలు వాలెరియో కాపారో, హెలెన్‌ బార్సిలు కూడా వివరించారు. కొంత మంది పురుషుల మహిళలతో పోలీస్తే వారు ఈ వ్యాధి బారిన తక్కువగా పడతారని భావిస్తున్నారని వారి తెలిపారు. ‘ఫేస్‌ మాస్క్‌ ధరించడాన్ని సిగ్గుచేటుగా బలహీనతకు సంకేతంగా, కళంకం అని మహిళల కంటే ఎక్కువగా పురుషులు భావిస్తున్నారని వారి పరిశోధనలో వెల్లడించారు.  అదే విధంగా ఈ లింగ భేదాలు కూడా ఫేస్‌ మాస్క్‌ ధరించడంపై కూడా ప్రభావం చూపుతున్నాయని కాపారో, బార్సిలో పేర్కొన్నారు. (సూర్యుడు కూడా ‘లాక్‌డౌన్‌‌’!)

అయితే మహిళలతో పోలీస్తే పురుషులు ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తమ పరిశోధనలలో తెలినట్లు చెప్పారు.  కరోనా వైరస్‌ వ్యాప్తి మహిళలో కంటే పురుషులలోనే అధిక రెట్టింపు ఉందని మంది వైద్య నిపుణులు కూడా అంచనా వేశారు. ఎందుకంటే పురుషుల రక్తంలో సాంద్రత ఎక్కువగా ఉన్నందున్న కణాలకు వైరస్‌ సోకడానికి సహాయపడే ఎంజైమ్‌ ఉత్పత్తి అవుతుందని వైద్యులు పేర్కొన్నారు. కాగా ఈ ప్రాణాంతక వైరస్‌ తమ్ము, శ్వాస కోశ బిందువుల ద్వారా మాత్రమే కాకుండా మనిసి దగ్గరగా  ఉండి మాట్లాడే సమయంలో  ఏరోసోల్స్‌ నుంచి కూడా వ్యాపిస్తుందని కొన్ని ఆధ్యయనాలల్లో వెల్లడవడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఫేస్‌ మాస్క్‌ ధరించడం తప్పనిసరి అని సిఫారసు చేసింది. (కరోనా పేషెంట్‌పై కేసు నమోదు..)

మరిన్ని వార్తలు