-

అందాల రాశిని హత్య చేసి 30 ఏళ్లు జైలు పాలు

14 Feb, 2016 16:26 IST|Sakshi
అందాల రాశిని హత్య చేసి 30 ఏళ్లు జైలు పాలు

కారాకస్: వెనెజులా సుందరి మోనికా స్పేర్ (29) హత్య కేసులో ముగ్గురు వ్యక్తులకు ముప్పై ఏళ్ల జైలు శిక్షపడింది. వారికి కఠినకారాగార శిక్ష విధిస్తూ ఉత్తర కారాబోబోలోని కోర్టు తీర్పు చెప్పింది. 'ఒక దొంగతనానికి పాల్పడే క్రమంలో వారు చేసింది ఉద్దేశ పూర్వక హత్యే' అని ఈ సందర్భంగా కోర్టు పేర్కొంది. మోనికా స్పేర్ 2004లో మిస్ వెనిజులా అందాల పోటీలో పాల్గొని కిరీటాన్ని దక్కించుకుంది. అదే మిస్ యూనివర్స్ పోటీలో కూడా పాల్గొంది. అనంతరం పలు టీవీ కార్యక్రమాల్లో కూడా నటించింది.

ఆమె ఒక రోజు తన భర్త హెన్రీ బెర్రీ (39) కూతురుతో కలిసి ఓ టూర్కి వెళ్లి తిరిగొస్తుండగా ఓ ఎజెన్సీ ప్రాంతంలో ముగ్గురు దొంగలు వారి వాహనాన్ని ఆపేశారు. వారికి సహాయం చేద్దామని ఓ ట్రక్కు డ్రైవర్ ప్రయత్నించినా అప్పటికే ఆ ముగ్గురు వారి కారుపై విచ్చల విడిగా కాల్పులు జరిపి వారిని దోచుకొని వెళ్లారు. ఈ కాల్పుల్లో మోనికా, ఆమె భర్త మరణించగా కూతురుకు గాయాలయ్యాయి. ఈ కేసును విచారించిన కోర్టు అంతకు ముందు ఇందులో కొంత పాత్ర ఉన్న 15, 17 ఏళ్ల ఇద్దరు యువకులకు నాలుగేళ్ల జైలు శిక్షను విధించడంతోపాటు మరో ముగ్గురుకి 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మరో మహిళకు 10 ఏళ్ల జైలు శిక్ష పడింది.

మరిన్ని వార్తలు