మానసిక రుగ్మతలు అందుకేనట!

6 Jun, 2016 12:43 IST|Sakshi
మానసిక రుగ్మతలు అందుకేనట!

వాషింగ్టన్: నగర జీవనానికి అలవాటుపడిన మనిషి ప్రకృతిని ఆస్వాదించడం దాదాపు మరచాడనే చెప్పాలి. అయితే ప్రకృతిలోని పచ్చదనం, తాజా గాలి దొరక్కపోవటంతో నగరవాసులు తీవ్రమైన మానసిక వ్యాధుల బారిన పడుతున్నాడని తాజా అధ్యయనంలో తేలింది. సహజ వాతావరణానికి దూరమౌతున్న కొద్దీ.. మానసిక వ్యాదులు పెరుగుతున్నాయని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ పరిశోధకులు తెలిపారు. ఈ పరిశోధనకు సంబంధించిన ఫలితాలను 'జర్నల్ సైన్స్'లో ప్రచురించారు.

మానసికపరమైన రుగ్మతలు, ఒత్తిడిని తగ్గించుకోవాలంటే నగరవాసికి సహజ వాతావరణం కావాల్సిందేనని పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ పీటర్ ఖాన్ తెలిపారు. ముఖ్యంగా పట్టణాల్లో విస్తరించిన పరిశ్రమలు ప్రజలకు సహజ వాతావరణాన్ని దూరం చేస్తున్నాయని తెలిపారు. మానసిక రుగ్మతల నుంచి దూరంగా ఉండాలంటే పట్టణవాసులు తమ రోజువారి జీవితంలో కాస్తయినా సహజ వాతావరణంలోకి వెళ్లాల్సిందే అని పరిశోధకులు తెలిపారు.
 

మరిన్ని వార్తలు