చంద్రుడి కో ఉల్కా దెబ్బ!

26 Feb, 2014 01:33 IST|Sakshi
చంద్రుడి కో ఉల్కా దెబ్బ!

మన చందమామకు భారీ ఉల్కా దెబ్బ తగిలింది. కారు సైజు ఉన్న ఓ ఉల్క గంటకు 61 వేల కి.మీ. వేగంతో దూసుకొచ్చి చంద్రుడి ఉపరితలాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో 8 సెకన్లపాటు భూమిపై నుంచి సైతం చిన్న చుక్కలా కనిపించేలా అత్యంత ప్రకాశం వెలువడింది. గతేడాది సెప్టెంబరు 11న జరిగిన ఈ పేలుడును స్పానిష్ ఖగోళ శాస్త్రవేత్త జోషే మారియో మాడీడో అప్పుడే వీడియో తీసినా.. అసలు విషయం నిర్ధారించుకునేందుకు, అంచనా వేసేందుకు ఇంత సమయం పట్టిందట. చంద్రుడిపై శాస్త్రవేత్తలు రికార్డు చేసిన ఉల్కాపాతాల్లోనే అతి భారీదైన ఈ పేలుడు వల్ల 15 టన్నుల టీఎన్‌టీ పేలుడుకు సమానమైన శక్తి వెలువడి ఉండవచ్చని, సుమారు 40 మీటర్ల గొయ్యి ఏర్పడి ఉంటుందని భావిస్తున్నారు. చిత్రంలో చంద్రుడిపై ఉల్క పడిన ప్రదేశాన్ని, వెలుతురును(బాణం గుర్తు వద్ద) చూడొచ్చు.

మరిన్ని వార్తలు