ఉల్కలే నీటిని భూమిపైకి తీసుకొచ్చాయా?

21 Jan, 2018 22:36 IST|Sakshi

బోస్టన్‌: భూమిపై జీవం పుట్టుకకు నీరు ప్రధాన కారకమనే విషయం శాస్త్రీయంగా ఇప్పటికే రుజువైంది. మరి ఈ భూమిపైకి నీరు ఎక్కడి నుంచి వచ్చింది? ఇందుకు సంబంధించి అమెరికాలోని మాసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎంఐటీ) శాస్త్రవేత్తలు సరికొత్త విషయాన్ని వెల్లడించారు. మన సౌర వ్యవస్థ ఆవిర్భవించిన తొలి రెండు మిలియన్‌ సంవత్సరాల్లో భూమిపైకి ఉల్కలే నీటిని తీసుకొచ్చాయని చెబుతున్నారు.

‘ఉల్కలనేవి అంతరిక్షంలోని శిథిల పదార్థాలు. సౌర మండలంలోని మంచు, వాయువులు, ధూళితో ఉల్కలు ఏర్పడతాయి. ఇవి మైక్రాన్ల నుంచి కొన్ని కిలోమీటర్ల మేర వ్యాసార్ధాన్ని కలిగి ఉంటాయి. వీటికి నిర్దిష్ట కక్ష్య ఉండదు. అంతరిక్షంలో సంచరిస్తున్న శిథిల పదార్థం భూమి సమీపంలోకి వచ్చినపుడు గురుత్వాకర్షణకు లోనవుతుంది. ఫలితంగా భూమి వాతావరణంలోకి ఆకర్షితమవుతాయి.

మరిన్ని వార్తలు