మేయర్‌ను ట్రక్‌కు కట్టి ఈడ్చుకెళ్లిన పౌరులు

10 Oct, 2019 12:17 IST|Sakshi

మెక్సికోలో దారుణం చోటు చేసుకుంది.  ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చలేదన్న ఆగ్రహంతో దక్షిణ మెక్సికో పౌరులు  చట్టాన్ని తమ  చేతుల్లోకి  చాలా అమానుషంగా ప్రవర్తించారు. మెక్సికన్ రాష్ట్ర మేయర్‌ను కిడ్నాప్‌ చేస, ఒక ట్రక్కుకు కట్టి, వీధుల గుండా లాక్కెళ్లిన ఘటన సంచలనం సృష్టించింది. దేశంలోని చిపాస్ రాష్ట్రంలోని లాస్ మార్గరీటాస్ పట్టణంలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు  చేసుకుంది. ఈ  ఉదంతానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

మీడియా నివేదికల ప్రకారం తోజోలాబల్ కమ్యూనిటీకి చెందిన 30మంది సభ్యులు మేయర్ కార్యాలయంలోకి చొరబడి మేయర్‌ జార్జ్ లూయిస్ ఎస్కాండన్‌ హెర్నాండెజ్ను బయటకు లాక్కొచ్చారు. అనంతరం పికప్ ట్రక్ వెనుక భాగంలో కట్టి ఈడ్చుకెళ్లారు.  ఇలా కొన్ని మీటర్లు లాక్కెళ్లారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. చివరకు పోలీసుల జోక్యంతో ప్రాణాపాయం నుంచి తృటిలో క్షేమంగా బయటపడ్డాడు మేయర్‌. 

అయితే ఈ సంఘటన జరిగిన ఎనిమిది గంటల తరువాత, మేయర్ హెర్నాండెజ్ లాస్ మార్గరీటాస్‌లో ప్రసంగించారు, శాంటారీటా సమాజంలోని నాయకులు దీనికి బాధ్యులుగా ప్రకటించారు. కిడ్నాప్‌, హత్యాహత్నం కింద ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. అటు ఈ సంఘటనలో 10 మంది గాయపడ్డారని, 11 మందిని అరెస్టు చేసినట్లు ప్రాసిక్యూటర్ జనరల్ కార్యాలయం తెలిపింది. కాగా ప్రత్యక్ష నగదు బదిలీలతో సహా అందించిన దానికంటే ఎక్కువ ప్రజా వనరులను అందోళనకారులు డిమాండ్ చేశారని, ఈ విషయంలో మేయర్‌ వైఫ్యలం ఈ సంఘటనకు దారి తీసిందని స్టేట్ ప్రాసిక్యూటర్ జార్జ్ లూయిస్ లావెన్ వెల్లడించారు.

మరిన్ని వార్తలు