మెక్సికోలో కాల్పులు

10 Mar, 2019 04:19 IST|Sakshi

15 మంది మృతి

గ్వానజువాటో: మెక్సికోలో దుండగులు రెచ్చిపోయారు. గ్వానజువాటో రాష్ట్రంలోని లాప్లాయా నైట్‌క్లబ్‌పై శనివారం తెల్లవారుజామున కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వరంగ ఆయిల్‌ సంస్థ పెమెక్స్‌ పైప్‌లైన్ల నుంచి ఇంధనాన్ని దొంగిలిస్తున్న ముఠాలు లక్ష్యంగా మెక్సికో సైన్యం వేట మొదలెట్టింది. ఈ నేపథ్యంలో అత్యాధునిక ఆయుధాలతో నైట్‌క్లబ్‌పై కాల్పులు జరిపిన దుండగులు ఘటనాస్థలం నుంచి కారులో పరారయ్యారు. పెమెక్స్‌ పైప్‌లైన్ల నుంచి ఆయిల్‌ చోరీ కారణంగా మెక్సికో గత కొన్నేళ్లలో రూ.21,000 కోట్లు నష్టపోయింది. 

మరిన్ని వార్తలు