జాక్సన్‌ పాప్‌ గీతాలు నిషేధం, మైనపు బొమ్మ తొలగింపు

8 Mar, 2019 10:55 IST|Sakshi

పాప్‌ రారాజు  మైఖేల్‌ జాక్సన్‌పై లైంగిక  వేధింపుల దుమారం

ఆయన పాప్‌ గీతాలను తొలగిస్తున్న దేశాలు 

మైనపు బొమ్మ తొలగింపు

పాప్‌ రారాజు మైఖేల్‌ జాక్సన్‌ను బాలలపై లైంగిక  దాడులు చేసేవారనే ఆరోపణలు న్నప్పటికీ మరణానంతరం ఆయన వేధింపుల పర్వం  వెలుగులోకి  వస్తున్నాయి. దీంతో ప్రపంచ దేశాల్లోని 12కుపైగా రేడియో స్టేషన్లు  ఆయన పాప్‌ గీతాలను బ్యాన్ చేస్తూ నిర్ణయించాయి. మైఖేల్ జాక్సన్ పాప్‌ గీతాలను తొలగిస్తున్నట్టు ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్, కెనడా తదితర  దేశాలు వెల్లడించాయి.   

మరణించి ఇన్నేళ్ళయినా చిన్న పిల్లలపై అతను చేసిన దుర్మార్గాల  పర్వం మైఖేల్‌ జాక్సన్‌ను మరింతగా  వెంటాడుతోంది. పాప్‌ గీతాల తొలగింపునకు తోడు బ్రిటిష్‌ నేషనల్‌ ఫుట్‌బాల్‌ మ్యూజియం నుంచి మైఖేల్‌ జాన్సన్‌ మైనపు బొమ్మను తొలగింస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.  

మైఖేల్ జాక్సన్  పాప్‌సింగర్‌గా ఒకవెలుగు వెలుగుతున్న క్రమంలో పిల్లలను లైంగికంగా వేధించేవాడని, వారిపట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడని  ఆరోపణలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా  జిమ్మీ సెఫ్ చక్‌ (41), వేడ్ రాబ్‌సన్ (36) లు  తమ పదేళ్ళు, ఏడేళ్ళ వయస్సులో మైఖేల్ తమ పట్ల దారుణంగా, చెప్పలేని విధంగా ప్రవర్తించేవాడని,  నెవర్లాండ్ ఎస్టేట్లో తాము ఇలాంటి అనుభవాలను ఎదుర్కొన్నామని తాజాగా వెలుగులోకి తీసుకొచ్చారు. అంతేకాదు తమ లాంటి బాధితులు చాలా మంది ఉన్నారంటూ సంచలనం సృష్టించారు.  

ఈ కథనాన్ని బ్రిటన్‌లోని ఓ ఛానల్ బుధవారం రాత్రి ప్రసారం చేసింది. మైఖేల్ ఫ్యాన్స్ కూడా చాలామంది ఇది విని షాక్ తిన్నారు. ఆ మధ్య అతని ఎస్టేట్ లో పని చేసిన ఓ మహిళ కూడా అతని నిర్వాకాన్ని బహిరంగ పర్చిన సంగతి తెలిసిందే. తను చూసిన దృశ్యాలను ఎవరికైనా చెబితే తన గొంతు కోస్తామని, అక్కడి ఉద్యోగులు తనను బెదిరించిన విషయాన్ని ఆమె గుర్తు చేయడం గమనార్హం.

మరిన్ని వార్తలు