అధ్యక్ష​ ఎన్నికల బరిలో మిషెల్‌ ఒబామా..!?

3 Aug, 2019 13:48 IST|Sakshi

వాషింగ్టన్‌ : అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా భార్య మిషెల్‌ ఒబామా.. దేశ రాజకీయాల్లోకి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో ఆమె బరిలో దిగబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించగల శక్తి మిషెల్‌కి మాత్రమే ఉందని.. ఆమె అధ్యక్ష ఎన్నికల బరిలో నిలవాలని అమెరికాకు చెందిన సినీ నిర్మాత మైఖేల్ మూర్ అభిప్రాయపడ్డారు. అదేవిధంగా పలు చర్చల్లో ట్రంప్‌కు దీటుగా ఆమె ప్రసంగించగలరని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో మూర్‌ వ్యాఖ్యలపై శుక్రవారం మిషెల్‌ ఒబామా స్పందించారు. తాను అమెరికా అధ్యక్ష పదవి బరిలో లేనని స్పష్టం చేశారు. ‘మెరుగైన ప్రపంచంలో అమెరికాను అభివృద్ది చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అందుకే దేశంలోని పలు కుటుంబాలకు ఆరోగ్యకరమైన జీవితాన్ని ఇవ్వడానికి.. యువ కార్యకర్తలతో కలిసి పలువురికి సాయం చేస్తున్నాను. ఈ అధ్యక్ష ఎన్నికల బరిలో ఉంటేసామాజిక కార్యక్రమాల్లో భాగం కాలేను. ప్రజలు సేవ చేయాలనే తపనతో మాత్రమే ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నా’ అని తెలిపారు. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు