లాక్‌డౌన్‌ ఎఫెక్ట్ : మైక్రోసాఫ్ట్ దూకుడు

30 Apr, 2020 13:42 IST|Sakshi
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల (ఫైల్ ఫోటో)

కోవిడ్ -19 సంక్షోభంలోనూ  మైక్రోసాఫ్ట్  ప్రోత్సాహకర ఫలితాలు

త్రైమాసిక ఫలితాల్లోభారీ లాభాలు  

లాక్‌డౌన్‌ ఎఫెక్ట్,  క్లౌడ్ బిజినెస్ జోరు

పుంజకున్న గేమింగ్ వ్యాపారం

సాక్షి,న్యూఢిల్లీ: కరోనా వైరస్ ఆందోళన, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు స్థంభించి పోయినప్పటికీ, ప్రపంచ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది. మైక్రోసాఫ్ట్ బుధవారం  ప్రకటించిన మూడవ త్రైమాసికంలో భారీ లాభాలను, ఆదాయాన్ని సాధించింది. తద్వారా వాల్ స్ట్రీట్ అంచనాలను అధిగమించింది. ముఖ్యగా కోవిడ్-19 వైరస్ విస్తరణ,లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమిత మైన ఉద్యోగులు క్లౌడ్ కంప్యూటింగ్ సేవలను విరివిగా వినియోగించడంతో ఈ సంక్షోభ కాలంలో కూడా మైక్రోసాఫ్ట్ మెరుగైన ఫలితాలను సాధించింది. (రూపాయి రయ్..రయ్...)

మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో మైక్రోసాఫ్ట్ ఆదాయం 35 బిలియన్ డాలర్లకు చేరింది. అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే ఆదాయాలు15 శాతం పెరిగాయి.నికర ఆదాయం 22 పెరిగి 10.8 బిలియన్ డాలర్లుకు చేరుకుంది. అమ్మకాలు 22 శాతం పెరిగాయి. ఆదాయం 33.6 బిలియన్ డాలర్లుగా వుంటుందని విశ్లేషకులు  అంచనా వేశారు.

క్లౌడ్ కంప్యూటింగ్ సేవల ద్వారా మైక్రోసాఫ్ట్ ఈ విజయాన్ని సాధించింది. లాక్‌డౌన్‌ తో ప్రజలు కంప్యూటర్లకు పరిమితమై ఇంటి నుండి పనిచేయడం ఆన్ లైన్ పాఠాలు లాంటి కారణాలతో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్,  సర్ఫేస్ హార్డ్‌వేర్ అమ్మకాలు పుంజకున్నాయి. అలాగే ఎక్కువ గేమింగ్ వైపు మొగ్గు చూపడంతో ఎక్స్ బాక్స్ వ్యాపారం కూడా లాభపడింది. తాజా ఫలితాలతో 1.35 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్తో ప్రపంచంలోనే అత్యంత విలువైన సంస్థగా మైక్రోసాఫ్ట్ స్థానాన్ని దక్కించుకుంది.  (ట్రంప్ టీంలో మన దిగ్గజాలు)

గత త్రైమాసికంలో ఇంటర్నెట్ ఆధారిత కంప్యూటింగ్ సేవల వైపు చాలా కంపెనీలు మొగ్గు చూపాయని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల  పేర్కొన్నారు.  దీంతో కేవలం రెండునెలల్లో రెండు సంవత్సరాల డిజిటల్ పరివర్తన చూశామన్నారు. రోజువారీ 75 మిలియన్లకు పైగా క్రియాశీల వినియోగదారులతో ఒక రోజులో 200 మిలియన్లకు పైగా సమావేశాల్లో పాల్గొన్నారని ఆయన చెప్పారు. అలాగే ఎక్స్‌బాక్స్ లైవ్ ఆన్‌లైన్ గేమింగ్కు సంబంధించి  దాదాపు 90 మిలియన్ల నెలవారీ క్రియాశీల వినియోగదారులుంటే ఈ కాలంలో రికార్డు స్థాయిలో 10 మిలియన్ల యూజర్లు అదనంగా చేరారని నాదెళ్ల ప్రకటించారు. (కరోనా కట్టడిలో కొత్త ఆశలు : ఈ మందుపై ప్రశంసలు)

మరిన్ని వార్తలు