ఈ పిజ్జా మూడేళ్లయినా పాడవదు!

20 Feb, 2016 12:05 IST|Sakshi
ఈ పిజ్జా మూడేళ్లయినా పాడవదు!

వాషింగ్టన్: మనం ఎంతో ఇష్టంగా తినే పిజ్జా కాస్త మిగిలిపోతే మరుసటి రోజు బయట పడేయాల్సిందే. ఎందుకంటే ఎంత ప్రిజ్‌లో పెట్టినా మహాఅయితే రెండ్రోజులకు మించి పిజ్జా పాడవకుండా ఉండడం కష్టం. కానీ అమెరికా తయారు చేసిన పిజ్జా మాత్రం ఏకంగా మూడేళ్లపాటు నిల్వ ఉంటుందట. మరి మూడేళ్లపాటు పాడవని పిజ్జా ఎందుకు తయారు చేశారో తెలుసా? ఆ దేశ సైన్యం కోసం.

 

అమెరికాలోని మారుమూల ప్రాంతాలు, సుదూర ప్రాంతాల్లో విధులు నిర్వర్తించే సైనికుల కోసం ఈ పిజ్జాను తయారు చేశారు. దీనికి ‘ఎంఈఆర్ 37’గా నామకరణం కూడా చేశారు. ఏ ఆహార పదార్థమైనా బ్యాక్టీరియా కారణంగానే పాడైపోతుంది. అయితే బ్యాక్టీరియా వృద్ధి చెందకుండా హర్షిల్ టెక్నాలజీతో అమెరికా ఆర్మీ ల్యాబ్‌లో ఈ పిజ్జాను సిద్ధం చేశారు.

మరిన్ని వార్తలు