అందుబాటులోకి పర్సనల్‌ థియేటర్‌

1 Feb, 2018 17:12 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మొబైల్‌ ఫోన్లలో నచ్చిన సినిమాలను చూడడం నేడు చాలా మందికి అలవాటు. వెలుతురు మధ్య కళ్లు చిట్లించుకొని తదేకంగా చూడడం వల్ల కళ్లే కాకుండా మెడ నరాలు నొప్పి లేస్తాయి. మొబైల్‌ ఫోన్‌ను పట్టుకొని చేతులు లాగుతుంటాయి. ఇలాంటి బాధలు లేకుండా సినిమాను బాగా చూడడానికి, బాగా ఎంజయ్‌ చేయడానికి చిన్న పాప్‌ థియేటర్‌ అందుబాటులోకి వస్తోంది. అయితే ఈ థియేటర్‌లో సినిమా చూడాలంటే కాళ్లు చాపుకుని పడుకునేంత స్థలం కావాలి.

గుండ్రటి డ్రమ్స్‌ ఆకృతిలో నల్లటి దుస్తులతో ఈ పాప్‌ థియేటర్‌ ఉంటుంది. థియేటర్‌పైన మొబైల్‌ ఫోన్‌ లేదా ట్యాబ్‌ పెట్టేందుకు వెసులుబాటు ఉంటుంది. ఆ తర్వాత ఆ చిన్న థియేటర్‌లోకి తలదూర్చి సినిమాను చూసేందుకు ఏర్పాటు ఉంటుంది. థియేటర్‌ ఎఫెక్ట్‌ రావడానికి అదనంగా సౌండ్‌ బాక్సులు, వాటిని ఆపరేట్‌ చేసేందుకు ఓ రిమోట్‌ ఉంటుంది. ఈ థియేటర్‌ను మడిచి చంకలోనో, బ్యాగులోనే పెట్టుకొని ఎక్కడికంటే అక్కడికి వెళ్లొచ్చు. ప్రస్తుతం దీన్ని ప్రయోగాత్మకంగా ఓ యూనివర్శిటీ విద్యార్థి తయారు చేశారు. దీన్ని పెద్ద ఎత్తున మార్కెట్‌లో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. అతడి ప్రయత్నాలు ఫలించి ఈ థియేటర్‌ త్వరలోనే మార్కెట్‌లోకి వస్తుందని సినిమా అభిమానులు ఆశిస్తున్నారు.

మరిన్ని వార్తలు