మిరాకిల్... వైద్యశాస్త్రంలోనే అరుదైన ఘటన

17 May, 2016 11:58 IST|Sakshi
మిరాకిల్... వైద్యశాస్త్రంలోనే అరుదైన ఘటన

వాషింగ్టన్: అమెరికా వైద్యులు అద్భుతం చేశారు. వైద్యశాస్త్రంలో ఎప్పుడు జరగని ఓ ఘటనకు సాక్షులుగా మిస్సోరి వైద్యులు నిలిచారు. చిన్నారి గర్భంలో ఉండగానే ప్రమాదవశాత్తూ తల్లి చనిపోయినా డాక్టర్లు ఆపరేషన్ చేసి కడుపులోని పసిపాపను సురక్షితంగా ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చారు. అయితే ఆ కుటుంబసభ్యులకు ఈ పరిస్థితికి ఎలా స్పందించాలో అర్థం కావడం లేదు. ఓ వైపు చిన్నారి కన్నతల్లి చనిపోయిందని వారు దుఖంలో ఉండగా.. మరోవైపు తల్లి ఎలాగు చనిపోయిందని వైద్యులు చేసిన ప్రయత్నం సక్సెస్ అయింది. ఓ పసిపాపను ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చి వైద్యులు నిజంగానే సరికొత్త చరిత్ర సృష్టించారు.

మాట్ రైడర్, సారా ఇల్లర్ దంపతులు. ఆగ్నేయ ముస్సోరి సమీపంలో వీరు నివాసం ఉండేవారు. అయితే గర్భంతో ఉన్న సారాను భర్త మాట్ రైడర్ హాస్పిటల్స్ కు తీసుకువస్తున్నాడు. మార్గం మధ్యలోనే ఓ ట్రాక్టర్ వీరి వాహనాన్ని ఢీకొంది. ఈ ఘటనలో మాట్ కు స్వల్పగాయాలు కాగా, ఇల్లర్ మాత్రం తీవ్రంగా గాయపడింది. ఘటనా స్థలానికి డాక్టర్లను రప్పించారు. అంబులెన్స్ లో వీరిని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా, కొన్ని నిమిషాల్లో గమ్యస్థానం చేరనుండగా ఇల్లర్ మృతిచెందింది.

హాస్పిటల్ కు వెళ్లగానే కొన్ని నిమిషాల్లోనే డాక్టర్లు ఆపరేషన్ చేసి చనిపోయిన ఇల్లర్ నుంచి పాప మాడిసన్ ను బయటకుతీశారని ఆమె సోదరి కసాండ్రా ఇల్లర్ చెప్పింది. తల్లి చనిపోవడంతో చిన్నారికి ఆక్సిజన్ అందదని భావించిన వైద్యులు మొదట మాడిసన్ ను వెంటిలేటర్ లో ఉంచారు. నాలుగు రోజుల తరువాత కన్ను తెరిచిన చిన్నారి వెంటనే నర్స్ వేలిని పట్టుకుందని సోదరి మృతిచెందిన బాధలోనూ తన సంతోషాన్ని పంచుకుంది. మాట్ ఎముకలు కొన్ని విరిగాయని, సెయింట్ లూయిస్ ఆప్పత్రితో చికిత్స పొందుతున్నాడని చెప్పింది. ఏది ఏమైతేనేం ఇప్పుడు ఆ పాపకు అమ్మ లేదన్నది వాస్తవమని చనిపోయిన ఇల్లర్ కన్నతల్లి కన్నీటి పర్యంతమైంది.

మరిన్ని వార్తలు