ప్రపంచ సుందరిగా ‘మిస్‌ మెక్సికో’

9 Dec, 2018 04:17 IST|Sakshi
వెనెస్సాకు కిరీటం అలంకరించిన మానుషి ఛిల్లర్‌

బీజింగ్‌: 2018 సంవత్సరానికి గానూ ప్రపంచసుందరి కిరీటాన్ని మెక్సికోకు చెందిన వెనెస్సా పోన్స్‌ డి లియోన్‌(26) గెలుచుకున్నారు. చైనాలోని సన్యా పట్టణంలో శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ప్రపంచసుందరి, భారత్‌కు చెందిన మానుషీ ఛిల్లర్‌.. వెనెస్సాకు ప్రపంచసుందరి కిరీటాన్ని అలంకరించారు. ఈ పోటీలో థాయ్‌లాండ్‌కు చెందిన నికోలేనే పిచప లిమ్‌స్నుకన్‌ మొదటి రన్నరప్‌గా నిలిచారు. మారియా వసిల్విచ్‌(బెలారస్‌), కదీజా రాబిన్సన్‌(జమైకా), క్విన్‌ అబేనక్యో(ఉగాండా)లు తొలి ఐదు స్థానాల్లో నిలిచారు.

కాగా, భారత్‌ నుంచి ఈసారి పోటీపడ్డ అనుకృతి వాస్‌(19) టాప్‌–30లో చోటు దక్కించుకున్నారు. ప్రపంచసుందరి టైటిల్‌ను గెలుచుకున్న అనంతరం వెనెస్సా మాట్లాడుతూ..‘దీన్ని నమ్మలేకపోతున్నా. నాకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి , మెక్సికో ప్రజలందరికీ ఈ గెలుపు అంకితం. నేను వాళ్లను గర్వపడేలా చేశాననే భావిస్తున్నా’ అని తెలిపారు. ఈ పోటీల్లో 118 దేశాలకు చెందిన సుందరీమణులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు