మిస్‌ వరల్డ్‌గా మెక్సికన్‌ యువతి

8 Dec, 2018 20:25 IST|Sakshi
వెనెస్సాకు కిరీటం తొడుగుతున్న మానుషి చిల్లర్‌

బీజింగ్‌ : ఈ ఏడాది ప్రపంచ సుందరిగా మెక్సికోకు చెందిన వెనెస్సా పోన్స్‌ డీ లియోన్‌(26) ఎంపికైంది. శనివారం సాయంత్రం చైనాలోని సన్యా సిటీలో జరిగిన 68వ ఎడిషన్‌ మిస్‌ వరల్డ్‌ పోటీల్లో న్యాయ నిర్ణేతల బృందం ఆమెను విజేతగా ప్రకటించింది. రన్నరప్‌గా థాయ్‌లాండ్‌కు చెందిన నికోలిన్‌ లిమ్స్‌నుకన్‌ నిలిచింది. మొత్తం 118 మంది పాల్గొన్న ఈ అందాల పోటీల్లో భారత్‌కు చెందిన అనుకృతి వ్యాస్‌(మిస్‌ ఇండియా 2018) టాప్‌ 30(19వ స్థానం)లో చోటు సంపాదించుకుంది.

ఇక మిస్‌ వరల్డ్‌ 2017 మానుషి చిల్లర్‌ తన వారసురాలు వెనెస్సాకు కిరీటం తొడిగింది. కాగా మెక్సికోకు చెందిన వెనెస్సా ఇంటర్నేషనల్‌ బిజినెస్‌లో డిగ్రీ పూర్తి చేసి.. ప్రస్తుతం మోడల్‌గా రాణిస్తోంది. పలు సామాజిక కార్యక్రమాల్లో భాగమవుతూ మానవతావాదిగా గుర్తింపు తెచ్చుకుంది.

Miss World | 2018 WE HAVE A NEW MISS WORLD !! THE 68TH MISS WORLD TITLE GOES TO: Mexico Vanessa Ponce de Leon Miss World | 2018 | FIRST RUNNER UP Thailand . . CONGRATULATIONS !! . #missworld #mw2018 #mwo #mw2018sanya #mw2018china #missmundo .

A post shared by Miss World (@missworld) on

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా