మిస్‌ వరల్డ్‌గా జమైకా సుందరి

15 Dec, 2019 01:14 IST|Sakshi
రన్నరప్‌(ఫ్రాన్స్, భారత్‌)లతో కలసి చిరునవ్వులు చిందిస్తున్న మిస్‌ వరల్డ్‌ టోనీ–ఆన్‌ సింగ్‌(మధ్యలో)

రెండో రన్నరప్‌గా భారత్‌కు చెందిన సుమన్‌ రావ్‌

లండన్‌: జమైకాకు చెందిన టోనీ–ఆన్‌ సింగ్‌ మిస్‌ వరల్డ్‌–2019 కిరీటం దక్కించుకున్నారు. లండన్‌లోని ఎక్సెల్‌ లండన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో శనివారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగిన కార్యక్రమంలో ఆమెను ఈ కిరీటం వరించింది. గత ఏడాది మిస్‌ వరల్డ్‌గా నిలిచిన మెక్సికో సుందరి వనెస్సా పొన్స్‌.. టోనీ–ఆన్‌ సింగ్‌ తలపై మిస్‌ వరల్డ్‌ కిరీటాన్ని అలంకరించారు. ఈ పోటీలో ఫస్ట్‌ రన్నరప్‌గా ఫ్రాన్స్‌కు చెందిన ఒఫ్లి మెజినో, సెకండ్‌ రన్నరప్‌గా భారత్‌కు చెందిన సుమన్‌ రావ్‌ నిలిచారు.

నవంబర్‌ 20వ తేదీ నుంచి మొదలైన 69వ మిస్‌ వరల్డ్‌–2019 పోటీలో 120 దేశాలకు చెందిన అందగత్తెలు పాల్గొన్నారు. పలు వడబోతల అనంతరం ఫైనల్స్‌ కోసం 10 మందిని ఎంపిక చేశారు. అంతిమంగా ఎంపికైన ఐదుగురికి ప్రముఖ వ్యాఖ్యాత పియర్స్‌ మోర్గాన్‌ నేతృత్వంలోని బృందం పలు ప్రశ్నలు సంధించింది. అందగత్తెల సమాధానాల ఆధారంగా విజేతలను ఎంపిక చేసింది. తన సొంతూరుతోపాటు ప్రపంచవ్యాప్తంగా లింగ సమానత్వం కోసం పోరాడతానని ఈ సందర్భంగా భారత్‌కు చెందిన రన్నరప్‌ సుమన్‌ రావ్‌ అన్నారు. జమైకా నుంచి మిస్‌ వరల్డ్‌ గెలుచుకున్న నాలుగో మహిళగా టోనీ–ఆన్‌ చరిత్ర సృష్టించారు. తొమ్మిదేళ్ల వయస్సులో ఆమె కుటుంబం అమెరికాకు వలస వెళ్లి, ఫ్లోరిడాలో స్థిరపడింది.సుమన్‌ రావ్‌

 ►  జననం: 1998 నవంబర్‌ 23
 ► స్వస్థలం: రాజస్తాన్‌ రాష్ట్రం ఉదయ్‌పూర్‌ సమీపంలోని అయిదానా
 ► తల్లి: సుశీలా కున్వర్‌ రావ్, గృహిణి
 ► తండ్రి: రతన్‌ సింగ్, నగల వ్యాపారి
 ►  విద్య: నవీముంబైలోని మహాత్మా స్కూల్‌ ఆఫ్‌ అకాడెమిక్స్‌ అండ్‌ స్పోర్ట్స్‌లో పాఠశాల విద్య పూర్తి చేశారు, ప్రస్తుతం ముంబై యూనివర్సిటీలో చార్టెర్డ్‌ అకౌంటెన్సీ చదువుతున్నారు.
 ► భాషలు: ఇంగ్లిష్, హిందీతోపాటు మాతృభాష మేవారీ
 ► వృత్తి: మోడల్, డ్యాన్సర్‌(కథక్‌)
 ► 2018లో మిస్‌ నవీముంబై పోటీలో పాల్గొని మొదటి రన్నరప్‌గా నిలిచారు. అనంతరం రాజస్తాన్‌ తరఫున పాల్గొని ఫెమినా మిస్‌ ఇండియా వరల్డ్‌ –2019ను, ఆ పోటీల్లోనే మిస్‌ ర్యాంప్‌వాక్‌ అవార్డు గెలుచుకున్నారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

యాంటీ బయాటిక్స్‌ అతి వాడకం అనర్థమే

2018లో 100 సార్లకుపైగా ఇంటర్నెట్‌ షట్‌డౌన్‌

యునెస్కో గుర్తింపు పొందిన ఫేమస్‌ మసాజ్‌

ఈనాటి ముఖ్యాంశాలు

బాత్రూంలో 10 నిమిషాల కంటే ఎక్కువ ఉంటే..

పాకిస్తాన్‌కు భారత్‌ కౌంటర్‌

భారతీయుల హవా

జాన్సన్‌ జయకేతనం

‘బేబీ యోధ’ క్రేజ్‌ చూస్తే షాక్‌ అవ్వాల్సిందే..!

ఈనాటి ముఖ్యాంశాలు

‘దానికోసం ఓ రాత్రి గడిపేందుకైనా సిద్ధపడతారు’

భద్రత అనుకుంటే.. చుక్కలు చూపించాయి..!

ఫోర్బ్స్‌ జాబితాలో నిర్మలా సీతారామన్‌ హవా

దుబాయికి ఈ సామగ్రి తీసుకెళ్లడం నిషేధం

 బోరిస్‌ జాన్సన్‌ ఘన విజయం

రికార్డు సృష్టిస్తున్న భారత్‌

నీ కొడుకు ముస్లిం కాదని ఒప్పుకో.. క్షమాపణ చెప్పు

ఢాకా ప్లాస్టిక్‌ ఫ్యాక్టరీలో పేలుడు: 13 మంది మృతి

ట్రంప్‌– గ్రెటా ట్వీట్‌ వార్‌!

ముగిసిన బ్రిటన్‌ ఎన్నికలు

ఈనాటి ముఖ్యాంశాలు

పాకిస్తానీయులు ఎక్కువగా వెతికింది వీరి కోసమే!

ఉగ్ర సయీద్‌ దోషే

అమెరికాలో కాల్పులు ఆరుగురు మృతి

ఫిన్‌ల్యాండ్‌ కేబినెట్‌లో 12 మంది మహిళలు

ప్రపంచాన్ని కదిలిస్తున్న బాల పర్యావరణవేత్తలు

ఈనాటి ముఖ్యాంశాలు

నోబెల్‌ వేడుక: ధోతి ధరించి.. భారతీయత ఉట్టిపడేలా!

తెలుగోడికి ఓటేసి గెలిపించండి..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

17 ఇయర్స్‌ ఇండస్ట్రీ

ఆ ఆఫర్‌కు నో చెప్పిన సమంత!

నేడు గొల్లపూడి అంత్యక్రియలు

మా అల్లుడు వెరీ కూల్‌!

అందరూ కనెక్ట్‌ అవుతారు

ఈ విజయానికి మూడు ప్రధాన కారణాలు