పక్షులను గుర్తించేందుకు మొబైల్ యాప్!

30 May, 2014 02:39 IST|Sakshi
పక్షులను గుర్తించేందుకు మొబైల్ యాప్!

 మీకో అందమైన పక్షి కనిపించింది. వెంటనే ఫొటో తీశారు. కానీ అది ఏ పక్షో? దాని విశేషాలేంటో మాత్రం తెలియలేదు. అయితే ఏం ఫర్వాలేదు. మీ మొబైల్‌లో బర్డ్‌స్నాప్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటే సరి.. ఆ పక్షి ఏ జాతిదో? దాని వివరాలేంటో ఇట్టే తెలిసిపోతాయి. అప్‌లోడ్ చేసిన ఫొటోలను పరిశీలించి సుమారు 500 పక్షిజాతులను గుర్తించే సరికొత్త ఐఫోన్ యాప్ ‘బర్డ్‌స్నాప్’ను కొలంబియా యూనివర్సిటీ పరిశోధకులు రూపొందించారు మరి.
 
ఏ పక్షి అరుపు ఎలా ఉంటుందో కూడా ఈ యాప్‌తో తెలుసుకోవచ్చు. అలాగే వంశ వృక్షం లేదా వర్ణమాలలోని అక్షరక్రమం లేదా ఒక ప్రాంతానికి, సీజన్‌కు ప్రత్యేకమవడం వంటి అంశాల ఆధారంగా కూడా ఆయా పక్షులను గుర్తించొచ్చు. త్వరలో వివిధ పక్షుల పాటలు, వాటి ఆడియో, వీడియోలను కూడా ఈ యాప్‌లో పొందుపరుస్తారట. అయితే ఈ యాప్‌లో ఉత్తర అమెరికాలో సాధారణమైన పక్షిజాతులే ఎక్కువగా ఉన్నాయి. అన్నట్టూ.. రకరకాల చెట్లను గుర్తించేందుకు ఉపయోగపడే ‘లీఫ్‌స్నాప్’ అనే యాప్‌ను కూడా వీరు గతంలో విడుదల చేశారు.

మరిన్ని వార్తలు