పాకిస్తాన్‌ మోడల్‌ చనిపోయినట్లు ట్రోల్స్‌

27 May, 2020 22:01 IST|Sakshi

ఇస్లామాబాద్‌ : అసభ్యకరమైన వస్త్రధారణతో సంప్రదాయాన్ని విస్మరించిందంటూ పాకిస్తాన్‌ మోడల్‌, నటి జరా అబిద్‌పై సోషల్‌ మీడియాలో విమర్శలు వెల్లువెత్తున్నాయి. దీంతో ఆమె ఇన్‌స్ట్రాగ్రామ్‌‌, ట్విటర్‌ వంటి సోషల్‌ మీడియా ఖాతాలను తొలగించినట్లు తెలుస్తోంది. అయితే గత శుక్రవారం కరాచీలో జరిగిన విమాన ప్రమాదంలో మోడల్‌ జరా అబిద్‌ మరణించినట్లు సోషల్‌ మీడియాలో వస్తున్న ట్రోల్స్‌ వైరల్‌గా మారాయి. ప్రమాదం జరిగిన సమయంలో జరా అదే విమానంలో ప్రయాణించినట్లు ఆమె స్నేహితులు భావిసున్నారు. అయితే పీఐఏ విమాన ప్రమాద ఘటనలో ఇద్దరు వ్యక్తులు మాత్రమే ప్రాణాలతో బయట పడినట్లు పాక్‌ అధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే. ప్రమాద సమయంలో జరా విమానంలో ఉందా? లేదా? అన్న దానిపై ఇప్పటివరకు సరైన స్పష్టతలేదని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన సోషల్ మీడియా ఖాతాలు తొలగించబడ్డాయి. ఆమె ట్విటర్‌, ఇన్‌స్ట్రాగ్రామ్‌‌ ఖాతాలను ఎవరు తొలగించారనే విషయంలో స్పష్టత లేదు.

అయితే ఈ క్రమంలో జరా అబిద్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ ఫోటోలపై కొంతమంది నెటిజన్లు ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. ‘పాకిస్తాన్‌ మహిళలు సమాజంలో సంప్రదాయ వస్త్రాలను ధరించి నిరాడంబరంగా ఉంటారు. అయితే జరా మాత్రం సంప్రదాయ వస్తాధారణకు విరుద్ధంగా ఉంది’ అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ‘శరీర భాగాలను కనిపించేలా దుస్తులు ధరించిన ఆమెను అల్లా ఎప్పటికీ ఇష్టపడడు. జన్నాత్‌(స్వర్గం)లో స్వచ్చమైన పురుషులు, మహిళలకు మాత్రమే ఆర్హత ఉంటుంది’  అని ఓ నెటిజన్‌ కామెంట్ చేశారు. ఇక ఆమె మృతిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

>
మరిన్ని వార్తలు