విమానం కూలినా అపాయం లేకుండా...

21 Jan, 2016 08:52 IST|Sakshi


అయ్యో.. విమానం విరిగిపోయి పడిపోతుందని అనుకుంటున్నారా? కానే కాదు.. విమానం కూలిపోయే పరిస్థితి వస్తే ప్రయాణికులకు ఎలాంటి అపాయం లేకుండా ఇలా కిందకు దిగుతుందన్న మాట. రష్యాకు చెందిన తతెరెంకో వాదిమీర్ నికొలావెచ్ అనే ఏవియేషన్ ఇంజనీర్ ఈ సరికొత్త డిజైన్ రూపొందించారు. విమానానికి ఏదైనా ముప్పు సంభవిస్తే, ప్రయాణికుల కేబిన్ ఇలా విడిపోతుంది. వెంటనే దానికి అమర్చిన పారాచూట్లు తెరుచుకుని కేబిన్ నెమ్మదిగా కిందకు దిగుతుందన్నమాట.

నీటిలో దిగినా మునిగిపోకుండా నిరోధించేందుకు వీలుగా కేబిన్ అడుగు భాగంలో రబ్బర్ ట్యూబులు ఏర్పాటు చేస్తామని నికొలావెచ్ తెలిపారు. అయితే ఈ నమూనాపై కొందరు పెదవి విరిచారు. ఇది ఆచరణలో కష్టసాధ్యమని అభిప్రాయపడుతున్నారు. ప్రయాణికులు కిందకు దిగినా.. పైలట్ల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మరి వీటికి నొకొలావెచ్ ఎలా స్పందిస్తారో..!

మరిన్ని వార్తలు