ఇమ్రాన్‌పై మాజీ క్రికెటర్‌ కైఫ్‌ ఫైర్‌

6 Oct, 2019 20:36 IST|Sakshi

లక్నో: పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌పై భారత మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ కైఫ్‌ తీవ్ర విమర్శలు చేశారు. ఒక్కప్పుడు గొప్ప క్రికెటర్‌గా ఉన్న ఇమ్రాన్‌.. నేడు పాక్‌ సైన్యం చేతిలో కీలుబొమ్మగా మారాడంటూ ట్వీట్‌ చేశాడు. పాకిస్తాన్‌ను ఉగ్రవాదులకు సురక్షితమైన అడ్డగా మార్చారని ఘాటూ విమర్శలతో విరుచుకుపడ్డారు. అంతేకాదు ఇటీవల ఐక్యరాజ్యసమితి వార్షిక సమావేశాల్లో భారత్‌పై చేసిన ఆరోపణలను కైఫ్‌ తీవ్రంగా ఖండించారు. ఇమ్రాన్‌ ఇలాంటి ప్రసంగం చేయడం దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు. జమ్మూకశ్మీర్‌లో కర్ఫ్యూ ఎత్తివేస్తే రక్తపాతమేనంటూ ఇమ్రాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కశ్మీర్‌ను కేవలం రాజకీయం కోసం మాత్రమే వాడుకుంటున్నారని ఆరోపించారు. ఆర్‌ఎస్‌ఎస్‌పై కూడా ఆయన విమర్శలు గుప్పించారు.  ఇమ్రాన్‌ వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా తీవ్ర విమ‍ర్శలు వ్యక్తమయ్యాయి. చాలా మంది క్రికెటర్లు కూడా దీనిపై స్పందించి.. పాక్‌ ప్రధాని వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

మరిన్ని వార్తలు