బ్రిటన్‌లో అరుదైన చేప లభ్యం

19 Jun, 2020 12:06 IST|Sakshi

లండన్‌ : యూకేలోని పోర్ట్ ల్యాండ్ హార్బర్ సమీపంలో "మోలా-మోలా" అని పిలిచే అరుదైన అతిపెద్ద సముద్రపు చేప దొరికింది. డోర్సెట్ తీరంలో సజీవంగా ఉన్న అత్యంత అరుదైన అతిపెద్ద బోనీ ఫిష్‌ని గుర్తించారు. సాధారణంగా ఉష్ణమండల జలాల్లో ఈ చేపలు సంచరిస్తాయి. ఈ చేపలు 2.3 టన్నుల బరువు, 10 అడుగుల పొడవు ఉంటాయి.

మరియన్ కన్జర్వేషన్ సొసైటీ ట్విట్టర్‌లో మోలా మోలా ఫోటోను పోస్ట్‌ చేసి, గ్రహం మీద సజీవంగా ఉన్న అతిపెద్ద బోనీ ఫిష్‌,  జెల్లీ ఫిష్‌లను తినడం కోసం వేసవికాలంలో యూకేకి వచ్చిందని కామెంట్‌ పెట్టారు. మోలా మోలా ఫోటో సామాజిక మాద్యమాల్లో వైరల్‌ అయింది.  ఈ చేపను లిజ్ హేమ్స్లీ చిత్రీకరించారు.

మరిన్ని వార్తలు