ఆ పెయింటింగ్ మరో సీక్రెట్ తెలిసింది!

22 Apr, 2016 19:16 IST|Sakshi
ఆ పెయింటింగ్ మరో సీక్రెట్ తెలిసింది!

ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు లియోనార్డో డావిన్సీ దృశ్యరూపమిచ్చిన చిత్రం మోనాలీసా. అయితే శతాబ్ధాలు గడుస్తున్నప్పటికీ ఈ చిత్రం వెనుక రహస్యం ఏమిటన్నది బయటపడలేదు.  అయితే ఒక్కో కోణంలో చూస్తే ఒక్కో తరహాలో కనిపించే ఆ పెయింటింగ్ వెనుకున్న మిస్టరీని ఛేదించేందుకు పురాత్వ శాస్త్రవేత్తలు, ఇతర విభాగాల నిపుణులు ఇప్పటికీ యత్నాలు సాగిస్తూనే ఉన్నారు.

దాదాపు ఐదు శతాబ్దాలు గడుస్తున్నా..  మోనాలీసా చిరునవ్వు వెనుక దాగున్న రహస్యం, ఆ చిత్రంలో ఆమె భిన్న కోణాల్లో ఎందుకు దర్శనమిస్తుంది? అసలు ఆమె ఎవరన్నది తెలియకపోయినా ఆదరిస్తూనే వస్తున్నారు. మోనాలీసా పెయింటింగ్ లో ఉన్న మహిళ.. ఫ్లోరెంటైన్ పట్టు వ్యాపారి భార్య లిసా గెరార్డినీ అని సైంటిస్టు పాస్కల్ కొట్టే గతంలో తెలిపారు. అయితే ఇతర కళా చరిత్రకారులు మాత్రం పాస్కల్ కొట్టే అన్వేషణలపై పలు అనుమానాలు వ్యక్తంచేశారు.

తాజాగా మరో విషయం బయటపడింది. డావిన్సీ తన దగ్గర పనిచేసే ఓ వ్యక్తికి ఇచ్చిన రూపం కూడా మోనాలీసాలో ఉందని, అతడు డావిన్సీకి గే లవర్ అని ఇటలీ పురాతత్వవేత్తలు చెబుతున్నారు. వ్యాపారి భార్య, గే లవర్ అయిన గియాన్ గియాకోమో లను కలిపి ఒకేరూపం ఇవ్వగా మోనాలీసా చిత్రరూపం ఏర్పడిందని ఇటలీకి చెందిన  సిల్వానో విన్సెటీ వివరించారు. ఈయన పరిశోధనల్ని కూడా కొందరు నిపుణులు వ్యతిరేకిస్తున్నారు. ఏది ఏమైనా, శతాబ్దాలు గడుస్తున్నాయి.. పరిశోధనలు జరుగుతూనే ఉన్నా.. ప్రపంచానికి తెలిసిన మోనాలీసా నిజంగానే మోనాలీసానా? కాదా? అన్న సందేహం మాత్రం నేటికీ తీరకపోవడం గమనార్హం.

>
మరిన్ని వార్తలు