కోతులకూ కుర్రాళ్ల ప్రవర్తన..

16 May, 2016 17:59 IST|Sakshi
కోతులకూ కుర్రాళ్ల ప్రవర్తన..

వాషింగ్టన్: మనుషుల్లానే కోతులు కూడా తమ జీవితకాలం పాటు ఇతరుల చూపులను అర్థం చేసుకుంటాయని శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. హార్వర్డ్ వర్సిటీ, పెనోస్లోవియా వర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం 481 రైసిస్ కోతుల మీద ఈ అధ్యయనం నిర్వహించారు. శిశువులతో పోలిస్తే కాస్త ముందుగానే బాల్య దశలో ఉన్న కోతులు శాస్త్రవేత్తల చూపులకు చురుగ్గా స్పందించాయని, పైకి చూడగానే ఇవి కూడా చూపును పైకి మరల్చాయని వివరించారు.

ఇక కుర్రాళ్లలా యవ్వనంలో ఉన్న మగ కోతులు ఆడ కోతుల వైపు అధికంగా చూసేవని తెలిపారు. వృద్ధాప్యంలో సైతం మనుషుల్లానే తమ చూపులను తిప్పాయన్నారు. చూసి నేర్చుకోవడం అనేది భాష, సామాజిక అవగాహన, జ్ఞానాన్ని పెంచుకునేందుకు పునాదని, ఇది మానవ జీవితంలో కీలక పాత్ర పోషిస్తుందని వాల్ యూనివర్సిటీ  చెందిన లారీ సాన్టోస్ తెలిపారు.
 

మరిన్ని వార్తలు