రూ.14వేల కోట్లు చెల్లించండి

15 May, 2019 04:52 IST|Sakshi

మోన్‌శాంటోకు అమెరికా కోర్టు ఆదేశం

శాన్‌ ఫ్రాన్సిస్కో: బేయర్‌కు చెందిన మోన్‌శాంటో అగ్రీ కంపెనీకి భారీ దెబ్బ తగిలింది. ఆ కంపెనీకి చెందిన ‘రౌండప్‌’ కలుపు మొక్కల నివారణి మందు కారణంగా తమకు క్యాన్సర్‌ వచ్చిందంటూ ఓ జంట వేసిన దావా నేపథ్యంలో వారికి సుమారు రూ.14 వేల కోట్ల పరిహారం చెల్లించాల్సిందిగా ఆక్లాండ్‌లోని కాలిఫోర్నియా కోర్టు ఆదేశించింది. రౌండప్‌కు సంబంధించి మోన్‌శాంటోకు కోర్టుల్లో వరుసగా ఇది మూడవ ఓటమి. గ్లైఫోసేట్‌ ఆధారిత తమ ఉత్పత్తికి, క్యాన్సర్‌కు ఎలాంటి సంబంధం లేదని కంపెనీ చెబుతోంది. కాగా తాజా తీర్పు చరిత్రాత్మకమని పిటిషనర్‌ తరఫు న్యాయవాదులు చెప్పారు. ఈ తీర్పును తాము సవాల్‌ చేయనున్నట్లు బేయర్‌ ఒక ప్రకటనలో తెలిపింది. 

మరిన్ని వార్తలు