చంద్రుడికో వరదగూడు!

4 Feb, 2015 02:13 IST|Sakshi
చంద్రుడికో వరదగూడు!

 చందమామ చుట్టూ రంగురంగుల కాంతివలయం ఏర్పడిన ఈ అద్భుత దృశ్యం సోమవారం బ్రిటన్‌లో కనువిందు చేసింది. అయితే ఇదంతా భూమి వాతావరణంలోని మంచు స్ఫటికాల మాయ! సుమారు 20 వేల అడుగుల ఎత్తులోని పలుచని మేఘాల్లోని మంచు స్ఫటికాలు చంద్రుడి కాంతిని వక్రీకరించి చూపడంతో ఇలా కనిపించింది. అన్నట్టూ... చంద్రుడి చుట్టూ ఇలా కాంతివలయం కనిపించడం అనేది.. వరదలొచ్చేంత భారీ వర్షాలకు సూచన అని భావిస్తారు. కానీ దానికి శాస్త్రీయ ఆధారాలు లేవని శాస్త్రవేత్తలు తేల్చేశారు.

>
మరిన్ని వార్తలు