అత్యంత వృద్ధ మనిషి కన్నుమూత

20 Sep, 2017 02:28 IST|Sakshi

వాషింగ్టన్‌: ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మనిషిగా గుర్తింపు పొందిన వయోలెట్‌ మోసె బ్రౌన్‌ 117 ఏళ్ల వయసులో మరణించింది. తీవ్ర డీహైడ్రేషన్‌కు గురై ఆమె ఈనెల 15న తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. 1900, మార్చి 10న బ్రిటిష్‌ పాలనలోని జమైకాలో బ్రౌన్‌ జన్మించారు.

2015లో బ్రౌన్‌ 115వ పుట్టిన రోజు సందర్భంగా బ్రిటన్‌ రెండో ఎలిజబెత్‌ రాణి ఆమె గౌరవార్థం ఓ లేఖను పంపారు. ఈ ఏడాది జూలై 27న 117 ఏళ్ల 139 రోజుల బ్రౌన్‌ పేరును గిన్నిస్‌ బుక్‌ అత్యంత వృద్ధ మహిళగా తమ రికార్డులో నమోదు చేసింది. ‘పంది మాంసం, కోడి మాంసం తప్ప అన్నీ తింటా. రమ్‌ లాంటి మత్తు పానీయాల జోలికిపోను’ అని బ్రౌన్‌ తన ఆరోగ్యరహస్యం చెప్పారు. ఆమె రెండో కొడుకు వయసు ప్రస్తుతం 96 ఏళ్లు కావడం విశేషం. బ్రౌన్‌ మరణంతో జపాన్‌కు చెందిన నబీ తాజిమా(117 ఏళ్ల 46 రోజులు) అత్యంత వృద్ధ మనిషిగా నిలుస్తారు.

>
మరిన్ని వార్తలు