ప్రపంచ పెద్దాయన

1 Mar, 2014 00:52 IST|Sakshi
ప్రపంచ పెద్దాయన

 సూటేసుకొని దర్జాగా కూర్చున్న ఈ తాతయ్య పేరు అటురో లికాటా. ఉండేది ఇటలీ దేశంలో. శుక్రవారంనాటికి ఈ తాత వయస్సు 111 సంవత్సరాల 302 రోజులు. దీంతో గిన్నిస్ సంస్థ వారు ప్రపంచంలోనే అత్యంత వృద్ధ వ్యక్తిగా ఈయన పేరును గిన్నిస్ పుస్తకంలో ఎక్కించేశారు.

 


 
 
 ఇవి ఆస్ట్రేలియా విక్టోరియా రాష్ట్రం మార్‌వెల్ పట్టణంలోని బొగ్గు గనులు. వీటి సమీపంలో ఉన్న పొదలను ఎవరో అంటించడంతో అది కాస్తా బొగ్గు గనులకు అంటుకుని ఇలా తగలబడిపోయింది. 400 హెక్టార్లలోని గనులు దాదాపు మూడువారాలుగా మండుతూనే ఉన్నాయి. ఆ మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది చాలా కష్టపడుతున్నారు. ప్రస్తుతం చాలావరకు మంటలు చల్లారినా పూర్తిగా అదుపులోకి రాలేదు.
 
 
 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు