కరోనా ఎఫెక్ట్‌: కన్నీటి పర్యంతమైన ఓ తల్లి!

19 Mar, 2020 14:39 IST|Sakshi

వాషింగ్టన్‌: ప్రాణాంతక కరోనా వైరస్‌(కోవిడ్‌-19) ధాటికి ప్రపంచ దేశాలన్నీ విలవిల్లాడుతున్నాయి. ఈ మహమ్మారి ప్రజల దరిచేరకుండా అనేక పటిష్ట చర్యలు చేపడుతున్నాయి. కరోనా కట్టడికై వ్యాక్సిన్‌ రూపొందించే పనిలో శాస్త్రవేత్తలు నిమగ్నం కాగా.. చికిత్స కంటే నివారణే మేలు అన్నచందంగా చాలా దేశాల్లో ప్రజలు సామాజిక ఎడం పాటిస్తూ తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. కరోనా ప్రబలకుండా ఉండేందుకు మాస్కులు ధరిస్తూ, శానిటైజర్లు వాడుతూ.. వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ.. ఇతర జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే కొన్నిచోట్ల వ్యాపారులు ప్రజల భయాన్ని, అవసరాలను సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా అమెరికాకు చెందిన ఓ మహిళ మరోసారి ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు.(‘అందుకే నా భర్తను దూరంగా ఉంచాను’)

వివరాలు... లారెన్‌ విట్నీ(36) అనే మహిళ తన నలుగురు పిల్లలతో కలిసి దక్షిణ ఊతాలో నివసిస్తున్నారు. ఈ క్రమంలో తన చంటిబిడ్డకు డైపర్లు కొనేందుకు స్థానిక స్టోర్‌కు వెళ్లారు. అయితే అక్కడ వాటి ధర చూసి ఆమె షాక్‌కు గురయ్యారు. ఒక్కో డైపర్‌ ప్యాకెట్‌ ధర 20 రెట్లు పెరిగిందని.. తను అంత ఖర్చు పెట్టి వాటిని కొనలేనని.. తన బిడ్డకు డైపర్లు ఎలా మార్చాలో అర్థంకావడం లేదని కన్నీటి పర్యంతమయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె టిక్‌టాక్‌లో షేర్‌ చేశారు. ఈ క్రమంలో నెటిజన్ల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. లారెన్‌పై సానూభూతి వ్యక్తం చేస్తూ.. కరోనా భయాన్ని వ్యాపారులు ఇలా వాడుకుంటున్నారంటూ మండిపడుతున్నారు. ఆమెకు తమ వంతు సాయం చేస్తామని ముందుకు వస్తున్నారు. ఈ విషయం గురించి లారెన్‌ మాట్లాడుతూ... తన ఈ వీడియోను డ్రాప్ట్స్‌లో పెట్టాలనుకున్నానని.. అయితే అనుకోకుండా అది అప్‌లోడ్‌ అయిపోయిందన్నారు. నిమిషాల్లోనే వైరల్‌లా మారిన ఈ వీడియో కారణంగా కొంత మంది వ్యాపారులైనా తమ వైఖరి మార్చుకుంటారనే నమ్మకంతో దానిని అలాగే ఉంచేశానని పేర్కొన్నారు.(‘కరోనా ఒత్తిడి తగ్గాలంటే ఇలా చేయండి’)

‘కరోనా’ వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభం!

వైద్యులు ఎన్నిసార్లు చేతులు కడుక్కుంటారో తెలుసా?

మరిన్ని వార్తలు